యాప్నగరం

Nampally TRS Candidate: నాంపల్లి అభ్యర్థికి షాకిచ్చిన కేసీఆర్

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన నవంబర్ 11న కేసీఆర్ మొత్తం 107 అభ్యర్థులకు బి-ఫారాలు అందజేశారు.

Samayam Telugu 17 Nov 2018, 11:25 pm
అసెంబ్లీ రద్దు చేసిన రోజే ఏకంగా 105 మంది అభ్యర్థులను టీఆర్ఎస్ అధ్యక్షుడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఆపై దశలవారీగా అభ్యర్థులను ప్రకటిస్తూ వచ్చిన టీఆర్ఎస్ అధినేత 119 స్థానలకుగానూ 117 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేశారు. ముషీరాబాద్, కోదాడ నియోజకవర్గాల అభ్యర్థిత్వాలను పెండింగ్‌లో ఉంచారు. అయితే అనూహ్యంగా టీఆర్ఎస్ నాంపల్లి అభ్యర్థికి గులాబీ బాస్ కేసీఆర్ షాకిచ్చారు.
Samayam Telugu KCR


గతంలో ప్రకటించిన ఎం ఆనంద్‌కుమార్‌ను పార్టీ అభ్యర్థిగా తప్పించింది. సీహెచ్ ఆనంద్‌ను నాంపల్లి స్థానం నుంచి బరిలోకి దింపుతున్నట్లు టీఆర్ఎస్ శ్రేణులు వెల్లడించాయి. దీంతో సీహెచ్ ఆనంద్‌కు ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీఆర్ఎస్ బి-ఫామ్‌ను అందజేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన నవంబర్ 11న కేసీఆర్ మొత్తం 107 అభ్యర్థులకు బి-ఫారాలు అందజేశారు. ఆనంద్‌కుమార్‌ విషయాన్ని పెండింగ్‌లో ఉంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శనివారం సీహెచ్ ఆనంద్‌కు బి-ఫారం అందజేశారు.

కాగా, ముషీరాబాద్‌ స్థానాన్ని తన సమీప బంధువు, కార్పొరేటర్‌ శ్రీనివాసరెడ్డికి ఇవ్వాల్సిందేనని ఆపద్ధర్మ మంత్రి నాయిని నర్సింహారెడ్డి డిమాండ్ చేస్తున్నారు. నేడు కేసీఆర్‌తో భేటీ అయినా నిర్ణయం తీసుకోలేదు. ఆదివారం మరోసారి కేసీఆర్‌తో నాయిని భేటీ కానున్నారు. మరోవైపు గత ఎన్నికల్లో పోటీచేసి ఓటమిపాలైన ముఠా గోపాల్‌కే ముషీరాబాద్ టిక్కెట్ ఇచ్చేందుకు కేసీఆర్ సుముఖంగా ఉన్నట్లు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.