యాప్నగరం

KCR: గెలుపు ఉత్సాహంలో పాట పాడిన కేసీఆర్

దేశ రాజకీయాలపై దృష్టి పెట్టడంతో పాటు ఏపీ రాజకీయాల్లోనూ కలగజేసుకుంటానని పరోక్షంగా వెల్లడించిన కేసీఆర్.. టీఆర్‌ఎస్‌ని గెలిపించిన ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలిపారు.

Samayam Telugu 11 Dec 2018, 6:51 pm
తెలంగాణ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఈరోజు సాయంత్రం మీడియాతో ఉత్సాహంగా మాట్లాడారు. 2014 ఎన్నికల్లో 63 సీట్లకే పరిమితమైన టీఆర్‌ఎస్.. తాజా ఎన్నికల్లో ఏకంగా 86 స్థానాల్లో గెలుపొంది.. ఇంకా ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇటీవల వెలువడిన లగడపాటి, జాతీయ మీడియా సర్వేతో ఒకింత ఒత్తిడికి గురైనట్లు కనిపించిన కేసీఆర్.. ఈరోజు స్పష్టమైన మెజార్టీ రావడంతో రిలాక్స్‌గా మీడియాతో ముచ్చటించారు.
Samayam Telugu Telugu-image


దేశ రాజకీయాలపై దృష్టి పెట్టడంతో పాటు ఏపీ రాజకీయాల్లోనూ కలగజేసుకుంటానని పరోక్షంగా వెల్లడించిన కేసీఆర్.. టీఆర్‌ఎస్‌ని గెలిపించిన ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలో.. స్వయంగా ఓ రచయితతో కలిసి తాను రాసిన పాటని కూడా పాడి సమావేశాన్ని మరింత ఉత్తేజంగా మార్చేశారు. కోటి ఎకరాలకి సాగునీరు అందిస్తే..? ఎవరూ వలసలు పోరని.. మహబూబ్‌నగర్‌లో సుమారు 8.5 లక్షల ఎకరాలకి ప్రస్తుతం నికరంగా సాగు నీరు అందుతోందని కేసీఆర్‌ వెల్లడించారు.
సమావేశంలో కేసీఆర్ పాడిన పాట..
వలసతో వలవల విలపించు కరవు జిల్లా..!
పెండింగ్ ప్రాజెక్టులన్నీ వడివడిగా పూర్తిచేసి..!!
చెరువులన్నీ నింపి పన్నీటి జలకమాడి..!
పాలమూరు తల్లి పచ్చపైట కప్పుకుంది..!!

పాలమూరు తల్లి పచ్చపైట కప్పుకోకపోతే.. అలా రాస్తే అది వ్యర్థమవుతుందన్న కేసీఆర్.. ఆ తల్లి పచ్చపైట ఇప్పుడు కప్పుకుంది కాబట్టే.. మాపై గులాబి పైట కప్పిందంటూ ఆనందం వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.