యాప్నగరం

రెండు చోట్ల ఓటు.. కేసీఆర్‌కు జైలు శిక్ష తప్పదు: రేవంత్ రెడ్డి

‘‘ప్రజలు తమ ఓట్లు గల్లంతై గగ్గోలు పెడుతుంటే.. కేసీఆర్ మాత్రం రెండు ప్రాంతాల్లో ఓటు హక్కు ఎలా పొందారు?’’ - రేవంత్ రెడ్డి

Samayam Telugu 9 Dec 2018, 5:32 pm
తెలంగాణ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. కేసీఆర్‌కు రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్నారని, అది చట్టిరిత్యా నేరమని అన్నారు. కేసీఆర్ తన సొంత ఊరైన చింతమడకతో పాటు, ఆయన పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో కూడా ఓటు హక్కు కలిగి ఉన్నారని రేవంత్ అన్నారు.
Samayam Telugu 716FC3CF-56CA-465D-8CFA-B2E22D049140


తప్పుడు ధృవీకరణ పత్రాలతో రెండు చోట్ల ఓటు హక్కును పొందినందుకు చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని రేవంత్ డిమాండ్ చేశారు. ప్రజల ఓట్లు తొలగించి.. తన తండ్రి కేసీఆర్‌కు రెండు చోట్ల ఓటు హక్కు కల్పించినందుకే కేటీఆర్ ఎన్నికల అధికారులను అభినందించి ఉంటారని రేవంత్ రెడ్డి ఎద్దేవ చేశారు.

ఒకే వ్యక్తి రెండు ఓటు హక్కులు కలిగి ఉంటే.. ప్రజాప్రాతినిధ్య చట్టం 1950, సెక్షన్(30) ప్రకారం ఏడాది జైలు, జరిమానా తప్పదని తెలిపారు. కేవలం దుర్బుద్ధితోనే కేసీఆర్ రెండు చోట్ల ఓట్లు నమోదు చేయించుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ అలా చేయడం మోసపూరితమని, ఎలక్షన్ కమిషన్‌ దీనిపై దృష్టి పెట్టాలన్నారు. దీనిపై తాను ఎన్నికల సంఘం ప్రధానాధికారికి ఫిర్యాదు చేయనున్నానని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.