యాప్నగరం

KTR: గ్రేటర్‌లో కేటీఆర్ ప్రచారం.. రేపటి నుంచి రోడ్‌షోలు

గ్రేటర్ ప్రచార బరిలో కేటీఆర్.. బుధవారం నుంచి హైదరాబాద్ పరిధిలోని నియోజకవర్గాల్లో రోడ్‌షోలు..

Samayam Telugu 20 Nov 2018, 2:26 pm
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ దూకుడు పెంచింది. ఓవైపు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచార సభలతో హోరెత్తిస్తుంటే.. ఇటు యువనేత కేటీఆర్ కూడా బరిలోకి దిగుతున్నారు. బుధవారం నుంచి గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలోని నియోజకవర్గాల్లో ప్రచారానికి సిద్ధమయ్యారు. జంటనగరాల్లో రోడ్‌షోలతో హోరెత్తించబోతున్నారు. ఈ మేరకు కేటీఆర్ రోడ్ షో షెడ్యూల్‌ను విడుదల చేశారు.
Samayam Telugu ktr


కేటీఆర్ రోడ్ షో షెడ్యూల్..

21- ఉప్పల్, మల్కాజ్ గిరి
22- మహేశ్వరం, ఎల్బీ నగర్
23- కంటోన్మెంట్, సికింద్రాబాద్
24- సనత్ నగర్, జూబ్లీహిల్స్
26- కుత్భుల్లాపూర్, కూకట్ పల్లి
27- గోషామహల్, ఖైరతాబాద్
28- శేరిలింగంపల్లి, పటాన్ చెరు
29- అంబర్ పేట, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

కేటీఆర్ రోడ్‌షోలు సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు.. రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు కొనసాగుతాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.