యాప్నగరం

Telangana Elections: 13 చోట్ల ముగిసిన పోలింగ్

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు, సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించిన తెలంగాణలోని 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసింది.

Samayam Telugu 7 Dec 2018, 4:32 pm
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నిక‌ల్లో చాలా ప్రాంతాల్లో ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ముందుగా చెప్పిన ప్రకారమే 13 నియోజకవర్గాల్లో పోలింగ్‌ ముగిసింది. నాలుగు గంటల సమయానికి పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఓటర్లకు ఓటు హక్కు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. మిగతా 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5గంటల వరకూ పోలింగ్‌ జరుగుతుంది. ఆ నియోజకవర్గాల్లో సైతం 5 గంటల వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న వారికే ఓటేసే ఛాన్స్ ఇస్తామని ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌కుమార్ చెప్పారు.
Samayam Telugu EVM


మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు, సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించిన ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం, సిర్పూర్‌, చెన్నూర్‌, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, మంథని, భూపాలపల్లి నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసింది. 4గంటల వరకే పోలింగ్‌ కేంద్రంలో ఉన్న వారు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

తెలంగాణాలో ఓవరాల్‌గా అన్ని నియోజకవర్గాల్లో కలిపి మధ్యాహ్నం 3 గంటల సమయానికి పోలింగ్‌ 56.17శాతం నమోదైంది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి కొద్ది సమయం ఉండటంతో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.