యాప్నగరం

Serilingampally: భిక్షపతికి బుజ్జగింపులు.. భవ్య ప్రసాద్‌కే మద్దతు..!

భిక్షపతి యాదవ్‌కు కాంగ్రెస్ సీనియర్ నేతల బుజ్జగింపులు.. నామినేషన్‌ను ఉపసంహరించుకునేందుకు సిద్ధమైన భిక్షపతి..!

Samayam Telugu 22 Nov 2018, 12:58 pm
తెలంగాణ ఎన్నికల్లో రెబల్స్ గుబులు టెన్షన్ పెడుతోంది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు దగ్గరపడటంతో.. రెబల్స్‌కు బుజ్జగింపులు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ విషయానికొస్తే.. ఈ అసంతృప్తుల బెడద కాస్త ఎక్కువగానే ఉంది. దీంతో పార్టీ బడా లీడర్లే రంగంలోకి దిగి.. రెబల్స్‌తో మాట్లాడుతున్నారు. రాబోయే రోజుల్లో సముచిత స్థానం ఇస్తామంటూ సర్థిచెబుతున్నారు. ఈ బుజ్జగింపులతో మెత్తబడ్డ నేతలు నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు ఓకే అంటున్నారు.
Samayam Telugu BIKSHAPATHI


గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో కీలకమైన శేరిలింగంపల్లిలో రెబల్‌గా బరిలోకి దిగిన కాంగ్రెస్ నేత భిక్షపతి యాదవ్ మెత్తబడ్డారు. పార్టీ పెద్దల బుజ్జగింపులతో పోటీ నుంచి తప్పుకున్నారు. గురువారం కూటమి తరపున బరిలో ఉన్న టీడీపీ అభ్యర్థి భవ్య ఆనందప్రసాద్‌ భిక్షపతిని కలిశారు. తనకు మద్దతిచ్చి పూర్తిస్థాయిలో ప్రచారంలో పాల్గొని గెలుపునకు సహకరించాలని కోరారు. ఆయన కూడా సహకరిస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

మరోవైపు భిక్షపతి యాదవ్‌ను బుజ్జగించడానికి ఏకంగా ఆరుగురు అగ్ర నేతలు ఆయన ఇంటికి వెళ్లారట. ముందు పార్టీ సీనియర్ నేత జైపాల్‌రెడ్డి కలిసినా.. నామినేషన్ ఉపసంహరణకు ఒప్పుకోలేదు. మళ్లీ బుధవారం రాత్రి ఏఐసీసీ నేత అహ్మద్‌ పటేల్‌, టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌, మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డి, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌ రెడ్డి, మాజీ ఎంపీ మధు యాష్కీ, సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ తదితరులు భిక్షపతి యాదవ్‌ ఇంటికి వెళ్లారట. పొత్తుతో భిక్షపతికి అన్యాయం జరిగిన మాట వాస్తవమేనని.. భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తామని బుజ్జగించారట. దీంతో ఆయన మెత్తబడ్డారని.. గురువారం నామినేషన్ ఉపసంహరించుకుంటారని పార్టీ నేతలు చెబుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.