యాప్నగరం

ఉద్యమ పుట్టినిల్లులో గులాబీ జెండా ఎగరేద్దాం: హరీష్‌రావు

కేసీఆర్ సభకు టీఆర్ఎస్ కార్యకర్తలు, టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాల లబ్దిదారులు భారీ సంఖ్యలో తరలిరావాలన్నారు.

Samayam Telugu 19 Nov 2018, 9:22 pm
తెలంగాణ సాధన ఉద్యమానికి దుబ్బాక, సిద్ధిపేట ప్రాంతాలు పుట్టినిల్లు వంటివని టీఆర్ఎస్ నేత, ఆపద్ధర్మ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. రేపు (నవంబర్ 20న) సిద్ధిపేటలో టీఆర్ఎస్ అధ్యక్షుడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించనున్న సభ ఏర్పాట్లను హరీష్ సోమవారం పరిశీలించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పత్తి మార్కెట్ యార్డు వద్ద హరీష్ మీడియాతో మాట్లాడారు. సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాలకు సంబంధించి టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ ఇక్కడికి వస్తున్నారని తెలిపారు.
Samayam Telugu Harish Rao


మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు కేసీఆర్ సభ ప్రారంభమవుతుందన్నారు. అసలే సిద్దిపేట, దుబ్బాక ప్రాంతాలు తెలంగాణ ఉద్యమానికి రెండు పుట్టినిల్లులు వంటివని వ్యాఖ్యానించారు. కేసీఆర్ సభకు ఆయన అభిమానులు, టీఆర్ఎస్ శ్రేణులు, తెలంగాణ ఉద్యమకారులు, టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాల లబ్దిదారులు భారీ సంఖ్యలో తరలి రావాలని హరీష్ పిలుపునిచ్చారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, భారీగా వాహనాలను సమకూర్చడం సాధ్యం కాదన్నారు.

కేసీఆర్ సిద్దిపేట నియోజకవర్గానికి ఎన్నో వరాలు ఇచ్చారని, ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు పనులు, రైల్వేలైన్ పనులు చురుకుగా సాగుతున్నాయని వెల్లడించారు. మరోసారి టీఆర్ఎస్‌కు అధికారం అందించి ఆశీర్వదించాలని కోరారు. టీఆర్ఎస్ శ్రేణులు పార్టీ విజయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.