యాప్నగరం

లక్షల్లో ఓట్లు గల్లంతయ్యాయనడం అవాస్తవం: రజత్ కుమార్

తెలంగాణలో లక్షల్లో ఓట్లు గల్లంతయ్యాయని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంలో నిజం లేదు.. ఒకవేళ ఓట్లు గల్లంతైతే తిరిగి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

Samayam Telugu 12 Dec 2018, 3:28 pm
తెలంగాణలో లక్షల్లో ఓట్లు గల్లంతయ్యాయని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు రాష్ట్రం ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్. ఓటర్ల నమోదుకు నిరంతరం కార్యక్రమాలు చేపట్టామని.. ఓట్లు గల్లంతైనవారు తిరిగి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో మొత్తం 2.81 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని.. వారిలో వందల్లో లేదా వేలల్లో ఓట్లు గల్లంతై ఉండొచ్చన్నారు. ప్రతి ఏడాది జనవరిలో ఓటర్‌ లిస్ట్‌లో పేర్లు చెక్‌ చేసుకోవాలన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడిన రజత్.. తెలంగాణ ఎన్నికలు, ఓటర్ల జాబితాకు సంబంధించిన అంశాలపై స్పందించారు.
Samayam Telugu Rajat


తెలంగాణలో ఎన్నికలు ప్రశాంతంగా, సాఫీగా జరిగాయని స్పష్టం చేశారు రజత్. కొత్త అసెంబ్లీ ఏర్పాటు కావడంతో.. ఎన్నికల కోడ్‌ నేటితో ముగిసిందని తెలిపారు. ఎన్నికలు విధుల్లో సహకరించిన అధికారులకు కృతజ్ఞత తెలిపారు. అలాగే నెల రోజుల్లోగా అభ్యర్థులందరూ తమ ఎన్నికల వ్యయానికి సంబంధించిన వివరాలు సమర్పించాల్సి ఉంటుందని, ఈవీఎంల ట్యాంపరింగ్‌కు ఏమాత్రం ఆస్కారం లేదన్నారు.

అంతకుముందు రజత్ కుమార్ గవర్నర్‌ నరసింహన్‌తో భేటీ అయ్యారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో గెలిచిన ఎమ్మెల్యేల ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేసి ఈసీకి సీఈవో పంపారు. గెలుపొందిన అభ్యర్థుల జాబితాను గవర్నర్‌ నరసింహన్‌ గెజిట్‌ రూపంలో విడుదల చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.