యాప్నగరం

Telangana Elections: చేతబడిచేసి కిడ్నాప్ చేశారు.. చంద్రముఖి!

గోషామహల్ నియోజకవర్గంలో బీఎల్ఎఫ్ అభ్యర్థిగా పోటీచేసిన ట్రాన్స్‌జెండర్ రాజేశ్ అలియాస్ చంద్రముఖిని కిడ్నాప్‌ వ్యవహారంతో కలకలం రేగిన విషయం తెలిసిందే.

Samayam Telugu 30 Nov 2018, 1:00 pm
గోషామహల్ నియోజకవర్గంలో బీఎల్ఎఫ్ అభ్యర్థిగా పోటీచేసిన ట్రాన్స్‌జెండర్ రాజేశ్ అలియాస్ చంద్రముఖిని కిడ్నాప్‌ వ్యవహారంతో కలకలం రేగిన విషయం తెలిసిందే. అయితే, ఆమెను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, తనకు తానుగా అదృశ్యమయ్యారని పోలీసులు వాదించారు. తాజాగా, ఈ వ్యవహారంపై చంద్రముఖి మాట్లాడుతూ.. కొందరు వ్యక్తులు తనను చేతబడి చేసి కిడ్నాప్ చేశారని సంచనల వ్యాఖ్యలు చేసింది. బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ... తాను మంగళవారం ఉదయం బ్యాంకులో రూ. 25 వేలు డిపాజిట్ చేయడానికి బయలుదేరి ఓ ఆటో ఎక్కానని తెలిపింది. ఆ ఆటో డ్రైవర్ తనను కోఠిలోని ఓ ప్రాంతానికి తీసుకెళ్లాడని, అక్కడ మరో ఆటో ఎక్కి ఎల్బీనగర్‌‌లో దిగానని చెప్పింది.
Samayam Telugu chandramukhi


ఎవరో చేతబడి చేసినట్టుగా తనను మైకం కమ్మేసిందని, ఎటు వెళుతున్నానో తెలియకుండానే ఎల్బీనగర్ నుంచి విజయవాడకు, అక్కడి నుంచి తిరుపతి, ఆపై చెన్నైకి వెళ్లానని చెప్పుకొచ్చింది. కోఠిలో ఇద్దరు తనను బెదిరించారని, వారిని చూస్తే గుర్తు పడతానని తెలిపింది. తాను ఎన్నికల్లో నామినేషన్ వేసిన దగ్గర నుంచి బెదిరింపులు వస్తూనే ఉన్నాయని, తన అజ్ఞాతం వెనుక చేతబడి, రాజకీయ కారణాలు ఉన్నాయని పేర్కొంది. అంతకు ముందు కోర్టులో భిన్న వాదనలు వినిపించడం విశేషం. స్థానిక రౌడీషీటర్ తనను బెదరిస్తున్నాడని, ట్రాన్స్‌జెండర్ల సమస్యలపై పోరాటం చేయరాదని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించింది. అయితే, ఆమె పొంతన లేని మాటలను నమ్మని పోలీసులు, అదృశ్యానికి గల కారణాలపై ఆరా తీస్తున్నామని తెలిపారు. మరోవైపు, చంద్రముఖికి ఎన్నికలు పూర్తయినంత వరకూ పూర్తిస్థాయి భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. విజయవాడకు స్వచ్ఛందంగా వెళ్లినట్టు చంద్రముఖి అంగీకరించడంతో కేసును ముగిస్తున్నామని పేర్కొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.