యాప్నగరం

ఎన్నికల్లో అవినీతికి, ఆదాయానికి సంబంధం ఉంది: ఈసీ రజత్‌కుమార్

తెలంగాణలో ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు.

Samayam Telugu 16 Nov 2018, 3:23 pm
తెలంగాణలో ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణపై అపోహలను తొలగించే ప్రయత్నం చేశారు. 1950 నుంచే శాసనసభ ఎన్నికల్లో గులాబీ రంగు బ్యాలెట్‌ పేపర్ల వినియోగం ఉందని గుర్తుచేశారు. తెలంగాణలో ఎన్నికలు చట్టబద్ధంగా నిర్వహిస్తామని అన్నారు. ఎన్నికల్లో గులాబీ రంగు బ్యాలెట్‌ పేపర్ల ప్రభావం ఉండదని.. ఓటు ఎవరికి వేయాలో ప్రజలకు తెలుసనని వ్యాఖ్యానించారు. వీవీప్యాట్‌లపై అవగాహన కల్పిస్తున్నామని, ప్రింట్‌ను 7 సెకన్లపాట్లు చూసేందుకు వీలు కల్పిస్తామని అన్నారు. ఎన్నికల్లో నగదు పంపిణీని నియంత్రిస్తున్నామని.. ఇప్పటి వరకూ రూ.85 కోట్ల మేర పట్టుబడిందని తెలిపారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే చాలా ఇక్కడ తక్కువ మొత్తం దొరికిందని, ఎన్నికల్లో నగదు ఎంత మంది ఇచ్చినా ఓటరు మాత్రం ఆలోచించే ఓటు వేస్తున్నారన్నారు.
Samayam Telugu EC


అలాగే ఈసీపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని రజత్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఎన్నికల్లో అవినీతికి, ఆదాయానికి సంబంధం ఉంటుందని, ఎవరైనా తప్పుడు అఫిడవిట్‌ సమర్పిస్తే దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని అన్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటివరకూ 12 మంది నేతలకు నోటీసులు జారీచేశామని, హైదరాబాద్‌లో 60 శాతానికి పైగా పోలింగ్‌ జరిగేలా కృషి చేస్తామని వివరించారు. ఓటుకు నోటు కేసుతో ఈసీకి సంబంధం లేదని.. అది ఎన్నికల సమయంలో జరగలేదన్నారు. తెలంగాణలో ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు తక్కువ సంఖ్యలో ఉన్నారని రజత్‌కుమార్‌ చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.