యాప్నగరం

ఓట్లేయడానికి వచ్చి క్యూలైన్‌లోనే ఇద్దరు మృతి

ఓటు వేసేందుకు పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన వేర్వేరు ప్రాంతాల్లో చోటు చేసుకుంది.

Samayam Telugu 7 Dec 2018, 1:08 pm
ఓటు వేసేందుకు పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన వేర్వేరు ప్రాంతాల్లో చోటు చేసుకుంది. వరంగల్‌ అర్బన్‌ జిల్లా భీమారం మండలం పైడిపల్లి గ్రామానికి చెందిన పరమాండ్ల స్వామి (55) అనే వ్యక్తి ఓటు వేసేందుకు వచ్చి పోలింగ్‌ బూత్‌లోనే కుప్పకూలిపోయాడు. దీన్ని గమనించిన సిబ్బంది అతన్ని చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో ఓటు వేసేందుకు వచ్చిన వృద్ధుడు సైతం గుండెపోటుతో కన్నుమూశాడు. నర్సింహ అనే వృద్ధుడు ఆ గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌కు ఓటు వేసేందుకు వచ్చాడు. అనంతరం క్యూలైన్‌లో నిలబడి ఉండగా అకస్మాత్తుగా ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో కుప్పకూలిపోయిన అతడిని పక్కనే ఉన్నవారు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే అతడు మృతిచెందాడు. నర్సింహ కుటుంబంలో విషాధచాయలు అలుముకున్నాయి.
Samayam Telugu swamy


కాగా, తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. మధ్యాహ్నం 12 గంటలకు వరకు 30శాతం పోలింగ్‌ నమోదు అయ్యింది. సినీ, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సినీ ప్రముఖులు పోలింగ్ కేంద్రాల వద్ద సామాన్యుల్లా క్యూలైన్‌లో నిలబడి ఓటు వేయడమే కాదు, అందరూ ఓటింగ్‌లో పాల్గొవాలని విఙ్ఞ‌ప్తి చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.