యాప్నగరం

Telangana Assembly Elections 2018: పోలింగ్ ఆరంభం.. మొరాయిస్తున్న ఈవీఎంలు

తెలంగాణలో పోలింగ్ మొదలైంది. ఈవీఎంలు మొరాయించడంతో పలు ప్రాంతాల్లో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది.

Samayam Telugu 7 Dec 2018, 9:28 am
తెలంగాణ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. అయితే, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పోలింగ్ చాలా ఆలస్యంగా మొదలైంది. కొడంగల్‌లో పోలింగ్ సిబ్బంది ఆలస్యంగా రావడంతో అక్కడ పోలింగ్ ఆలస్యంగా మొదలైంది. స్టేషన్ ఘనపూర్‌లోని శివునిపురిలో సైతం పోలింగ్ ఆలస్యమైంది.
Samayam Telugu Untitled11


ఎల్బీ నగర్ నియోజవర్గంలోని హయత్ నగర్‌లోనూ పోలింగ్ ఆలస్యం కావడంతో ఓటర్లు ఆందోళనకు దిగారు. రంగారెడ్డి జిల్లా మేడిపల్లిలో సైతం ఈవీఎం సమస్యలు నెలకొన్నాయి. నాగర్ కర్నూల్‌లోని కోడేరులో ఈవీఎంలు పనిచేయక పోలింగ్ ఆలస్యమైంది. కరీంనగర్ జిల్లాలోని కోరుట్ల, ఉమ్మడి మెదక్ జిల్లాల్లోని పలు పోలింగ్ బూత్‌లలో పోలింగ్ ఆలస్యంగా మొదలైంది. దీంతో త్వరగా ఓటేసేందుకు ఉదయాన్నే పోలింగ్ బూత్‌కు వెళ్లిన ఓటర్లకు తిప్పలు తప్పలేదు. కామారెడ్డిలో ఓటర్లు ఎన్నికల సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. పోలింగ్ ఏర్పాట్లు బాగోలేదంటూ ఆందోళనకు దిగారు.

ఓటేసిన మంత్రులు, ప్రముఖులు: మంత్రులు హరీష్ రావు, జగదీష్ రావు‌లు శుక్రవారం ఉదయమే పోలింగ్ బూత్‌లకు చేరుకుని తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. హరీష్ రావు సిద్ధిపేటలోను, జగదీష్ రావు సూర్యాపేటలోను ఓటేశారు. కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసిని మెహదీపట్నంలో ఓటేశారు. బ్యాట్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూ, సినీ నటుడు వడ్డే నవీన్‌లు హైదరాబాద్‌లో ఓటేశారు. అక్కినేని నాగార్జున, అమల క్యూలైన్లో నిలుచుని ఓటింగులో పాల్గొన్నారు. హీరో అల్లు అర్జున్ సైతం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.