యాప్నగరం

ఓట్లేసినవారిలో పురుషుల కంటే మహిళలే అధికం

రాష్ట్ర వ్యాప్తంగా 73.2 శాతం పోలింగ్‌ నమోదైనట్టు పోలింగ్ ముగిసిన 24 గంటల తర్వాత తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ ప్రకటించారు.

Samayam Telugu 9 Dec 2018, 8:41 am
రాష్ట్ర వ్యాప్తంగా 73.2 శాతం పోలింగ్‌ నమోదైనట్టు పోలింగ్ ముగిసిన 24 గంటల తర్వాత తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ ప్రకటించారు. ఇది 2014 ఎన్నికలతో పోల్చుకుంటే దాదాపు 4 శాతం అధికం. గత ఎన్నికల్లో 69.5శాతం మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా పోలింగ్ నమోదుకావడం విశేషం. జిల్లాలవారీగా చూస్తే 90.95 శాతం ఓట్లతో యాదాద్రి భువనగిరి అగ్ర స్థానంలో నిలవగా, 48.89 శాతం ఓట్లతో హైదరాబాద్ చిట్టచివరిన నిలిచింది. నియోజకవర్గాల వారీగా మధిర 91.65 శాతం ఓట్లతో తొలి స్థానంలో నిలవగా, 40.18 శాతంతో చార్మినార్ అట్టడుగున నిలిచింది. ఇక, ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడంలో మహిళలే ముందు నిలిచారు. పురుషులతో పోలిస్తే అత్యధికంగా వీరే ఓటు హక్కును వినియోగించుకున్నారు. నియోజకవర్గాల వారీగా పోలింగ్‌ సరళిని విశ్లేషిస్తే ఈ విషయం వెల్లడైంది.
Samayam Telugu women


మహిళ ఓటర్లలో 73.88 శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ వెల్లడించారు. మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల కరీంనగర్‌, సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, మహబూబ్‌నగర్‌, వనపర్తి, వరంగల్‌ అర్బన్‌, భూపాలపల్లి, ఖమ్మం జిల్లాల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొని ఓటు వేశారు. ట్రాన్స్‌జెండర్స్‌ ఓటర్లలో 8.99 శాతం మంది ఓటు వేశారు. తెలంగాణ వ్యాప్తంగా మహిళలు 73.88 శాతం ఓటు హక్కును వినియోగించుకోగా, పురుషులు 72.54 శాతం మంది పాల్గొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.