యాప్నగరం

డిపాజిట్ కోల్పోయిన బాబూమోహన్..!

2014లో టీఆర్‌ఎస్ తరఫున ఆంథోల్‌ నియోజకవర్గంలో గెలుపొందిన బాబూమోహన్‌కి తాజా ఎన్నికల్లో టీఆర్‌ఎస్ టికెట్ ఇవ్వలేదు. అతని స్థానంలో సీనియర్ టీవీ జర్నలిస్ట్‌ క్రాంతి కిరణ్ చంటికి కేసీఆర్ అవకాశం ఇచ్చారు.

Samayam Telugu 11 Dec 2018, 7:59 pm
తెలంగాణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ జోరు ముందు కాంగ్రెస్, టీడీపీతో సహా బీజేపీ కూడా చిత్తుగా ఓడిపోయింది. ఈరోజు ప్రకటించిన ఎన్నికల ఫలితాల్లో 87 స్థానాల్ని టీఆర్‌ఎస్ దక్కించుకోగా.. మహాకూటమిలో ఉన్న కాంగ్రెస్‌, టీడీపీ కలిసి 21 సీట్లు దక్కించుకున్నాయి. మరోవైపు రాష్ట్రంలోని 119 స్థానాల్లోనూ పోటీపడిన బీజేపీ కేవలం ఒకే ఒక్క స్థానంలో విజయాన్ని అందుకుంది. అది కూడా.. గోషామహల్‌‌లో.. రాజా సింగ్‌ 17, 734 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక బీజేపీ తరఫున ఆంథోల్‌ పోటీపడిన సినీ నటుడు, మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్ కనీసం డిపాజిట్‌ కూడా దక్కించుకోలేకపోయారు.
Samayam Telugu babu


2014లో టీఆర్‌ఎస్ తరఫున ఆంథోల్‌ నియోజకవర్గంలో గెలుపొందిన బాబూమోహన్‌కి తాజా ఎన్నికల్లో టీఆర్‌ఎస్ టికెట్ ఇవ్వలేదు. అతని స్థానంలో సీనియర్ టీవీ జర్నలిస్ట్‌ క్రాంతి కిరణ్ చంటికి కేసీఆర్ అవకాశం ఇచ్చారు. దీంతో.. టీఆర్‌ఎస్‌ను వీడిన బాబూమోహన్.. బీజేపీలో చేరి పోటీ చేశారు. కానీ.. ఈరోజు ప్రకటించిన ఫలితాల్లో అతనికి ఘోర పరాభవం ఎదురైంది. టీఆర్‌ఎస్ అభ్యర్థి.. క్రాంతి 1,04,229 ఓట్లని దక్కించుకోగా.. కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహ 87,764 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. వీరి ఓట్ల మధ్య వ్యత్యాసమే 16,465కాగా.. బాబూ మోహన్‌కి దక్కిన ఓట్లు 2,404 మాత్రమే. దీంతో.. డిపాజిట్ కోల్పోయిన ఈ కమెడియన్ పొలిటికల్ కెరీర్ ప్రశ్నార్థకంలో పడిపోయింది..!!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.