యాప్నగరం

Telangana Elections: కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో TRS, కాంగ్రెస్ మధ్య ఘర్షణ.. ఉద్రిక్తత

తెలంగాణలో ఎన్నికల పోలింగ్ ఇప్పటి వరకూ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ ఎన్నికలను అధికార, విపక్షాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో విచ్చలవిడిగా మద్యం, నగదు పంచి ఓటర్లను ప్రలోభానికి గురిచేశాయి.

Samayam Telugu 7 Dec 2018, 12:22 pm
తెలంగాణలో ఎన్నికల పోలింగ్ ఇప్పటి వరకూ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ ఎన్నికలను అధికార, విపక్షాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో విచ్చలవిడిగా మద్యం, నగదు పంచి ఓటర్లను ప్రలోభానికి గురిచేశాయి. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే పరిస్థితికి దారితీసింది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మద్యం, డబ్బు పంచుతున్నారంటూ పరస్పర ఆరోపణలు చేసుకుని, వాగ్వాదాలకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని చోట్ల వాహనాల అద్దాలను సైతం ధ్వంసం చేయగా, గుట్టుచప్పుడు కాకుండా ప్రచారం చేస్తున్న వారిని అడ్డుకున్న ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ గొడవలు గురువారం అర్ధరాత్రి వరకూ కొనసాగుతూనే ఉన్నాయి. కాగా, ఈ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించిన కొడంగల్ నియోజకవర్గంలో గురువారం అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది.
Samayam Telugu kosgi


టీఆర్ఎస్ నేతలు లాఠీలు, మద్యం సీసాలను వాహనాల్లో తరలిస్తుండగా ప్రజాకూటమి కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కోస్గి సమీపంలోని బాహర్‌ పేట కాలనీలో టీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్‌ రెడ్డి తన అనుచరులతో కలిసి నాలుగు వాహనాల్లో చేరుకున్నారు. ఆయన వెంటన వచ్చిన ఓ వాహనంలో లాఠీలు, మద్యం ఉన్నాయంటూ కాంగ్రెస్ నాయకులు వాటిని అడ్డుకున్నారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో, పోలీసులు ఆ వాహనాలను తనిఖీ చేయగా లాఠీలు బయటడ్డాయి. అన్ని వాహనాలను తనిఖీ చేయాలంటూ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డితో పాటు, ఇతర నాయకులు పట్టుబట్టారు. రెండు గంటల పాటు ఈ ఉద్రిక్తత కొనసాగగా ఎస్పీ ఇరు వర్గాలను శాంతింప జేశారు. కర్రలు లభ్యమైన వాహనాన్ని పోలీసు స్టేషన్‌కు తరలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.