యాప్నగరం

KTR: సిరిసిల్లలో నామినేషన్ దాఖలు చేసిన కేటీఆర్

సిరిసిల్లలో నామినేషన్ దాఖలు చేసిన కేటీఆర్.. ఎలాంటి హడావిడి లేకుండా కొందరు నేతలతో వచ్చి నామినేషన్ పత్రాలు సమర్పించిన ఆపద్ధర్మ మంత్రి.

Samayam Telugu 19 Nov 2018, 3:41 pm
సిరిసిల్ల నియోజవర్గ టీఆర్ఎస్ అభ్యర్థిగా తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ నామినేషన్ వేశారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో.. సిరిసిల్ల మున్సిపల్ ఛైర్మన్ పావని, ముఖ్య నేతల సమక్షంలో.. రిటర్నింగ్ అధికారి శ్రీనివాసరావుకు నామినేషన్ పత్రాలను సమర్పించారు. కేటీఆర్ ఎలాంటి హడావిడి లేకుండా వచ్చి.. తన నామినేషన్ దాఖలు చేసిన వెళ్లారు.
Samayam Telugu ktr


అంతకముందు.. సిరిసిల్లలో మంగళవారం సీఎం కేసీఆర్ పాల్గొనే బహిరంగ సభ ఏర్పాట్లను కేటీఆర్ పర్యవేక్షించారు. సభా ప్రాంగణంతో పాటూ మిగిలిన ఏర్పాట్లను అడిగి తెలుసుకొని.. కొన్ని సూచనలు చేశారు. కేటీఆర్ వెంట హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, స్థానిక టీఆర్‌ఎస్ నేతలు ఉన్నారు. రేపు మధ్యాహ్నం 3.30 గంటలకు సిరిసిల్లలో నిర్వహించే భారీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొనబోతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.