యాప్నగరం

'కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో' నినాదంతో ప్రజల్లోకి వెళతాం: ఉత్తమ్

గజదొంగల కంటే ఎక్కువ తెలంగాణలో లూటీ జరుగుతోంది.. "కేసీఆర్ హఠావో తెలంగాణ బచావో'' అన్న నినాదంతోనే ప్రజల్లోకి వెళతాం..

Samayam Telugu 1 Oct 2018, 5:53 pm
తెలంగాణకు కేసీఆర్ పెద్ద ద్రోహి అని మండిపడ్డారు టీ-పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. టీఆర్ఎస్‌ దుర్మార్గ పాలనను ప్రజల్లో ఎండగట్టేందుకు.. జనసంపర్క్ అభియాన్ యాత్రలు ప్రారంభించబోతున్నామని తెలిపారు. గాంధీ భవన్‌లో మాట్లాడిన ఉత్తమ్.. కేసీఆర్, టీఆర్ఎస్‌పై మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ అడ్డదారిలో మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తోందన్నారు పీసీసీ చీఫ్. తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గజదొంగల కంటే ఎక్కువ తెలంగాణలో లూటీ జరుగుతోందన్నారు. "కేసీఆర్ హఠావో తెలంగాణ బచావో'' అన్న నినాదంతోనే ప్రజల్లోకి వెళతామన్నారు ఉత్తమ్.
Samayam Telugu T Cong


ఆపద్ధర్మ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తూ.. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తోందన్నారు ఉత్తమ్. ఆర్టీసి బస్సులపై సీఎం, మంత్రుల ఫోటోలతో వున్న ప్రకటనలను ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు. ఈ ఉల్లంఘల్ని ఎన్నికల సంఘం పట్టిచుకోకపోవడం దారుణమన్నారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని.. వారు స్పందించకపోతే సీఈసీని కలుస్తామన్నారు. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళతామన్నారు. ఈవీఎం ట్యాంపరింగ్‌పై అనుమానాలున్నాయని.. ఈవీఎం టెస్టింగ్ నియోజకవర్గాల కేంద్రాల్లో కూడా పెట్టాలని కోరతామన్నారు.

మంగళవారం నుంచి జన్ సంపర్క్ అభియాన్ యాత్ర ప్రారంభిస్తామన్నారు ఉత్తమ్. ఈ యాత్ర ద్వారా కింద గడప గడపకు తిరిగి.. ప్రచారం చేస్తామన్నారు. అలాగే గాంధీ 150వ జయంతిని గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహిస్తామన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.