యాప్నగరం

మన్నెకే టికెట్ ఇవ్వాలి.. తల బద్దలుకొట్టుకున్న టీఆర్‌ఎస్ కార్యకర్త

టీఆర్‌ఎస్ పార్టీలో ఖైరతాబాద్ టికెట్ వ్యవహారం దుమారం రేపుతోంది. మన్నె గోవర్దన్ రెడ్డి అనుచరుల నిరసనతో తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.

Samayam Telugu 13 Nov 2018, 6:56 pm
టీఆర్‌ఎస్‌లో ‘ఖైరతాబాద్’ సీటు దుమారం తీవ్ర రూపం దాల్చింది. ఖైరతాబాద్ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న మన్నె గోవర్దన్ రెడ్డి తన అనుచరులు, మద్దతుదారులతో రెండు రోజులుగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన తన అనుచరులతో కలిసి తెలంగాణ భవన్ ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులు ఆయణ్ని మధ్యలోనే అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొంత మంది కార్యకర్తలు పోలీసులను ఎదిరిస్తూ తెలంగాణ భవన్ వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో మన్నె అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత ఆయన అనుచరుడొకరు తల బద్దలుకొట్టుకొంటూ నిరసన వ్యక్తం చేయడం కలకలం రేపింది.
Samayam Telugu manne


అస్వస్థతకు గురైన మన్నె గోవర్దన్ రెడ్డిని సిటీ న్యూరో సెంటర్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. మన్నే అనుచరులు ఆస్పత్రి ముందు హంగామా చేశారు. అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న అభిమానులు ధర్నా నిర్వహించారు. ఇదే సమయంలో ఓ కార్యకర్త తల బద్దలు కొట్టుకోవడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.


మరోవైపు ఖైరతాబాద్ వద్ద సెల్ టవర్ ఎక్కి మన్నె అనుచరులు మరి కొంత మంది నిరసన తెలుపుతున్నారు. ఖైరతాబాద్‌తో పాటు మరి కొన్ని స్థానాలకు టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఖైరతాబాద్ టికెట్ రేసులో దానం నాగేందర్, పీజేఆర్ కుమార్తె విజయా రెడ్డి ఉన్నారు. వీరిద్దరిలో ఎవరికి టికెట్ కేటాయించాలనే అంశం అధిష్టానానికి తలనొప్పిగా మారగా.. తాజాగా మన్నె గోవర్దన్ ఉదంతం సమస్యను మరింత జఠిలం చేస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.