యాప్నగరం

Narendra Modi: టచ్‌ చేసి చూస్తే మోదీకి మా పవర్‌ ఏంటో తెలుస్తుంది: కేటీఆర్‌

టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గడ్డం తీయకపోతే తెలంగాణకు పెద్ద నష్టం ఏమీ లేదు. కానీ గడ్డం తీయకపోతే సన్యాసుల్లో కలవాల్సిందేనంటూ కేటీఆర్‌ ఎద్దేవా చేశారు.

Samayam Telugu 3 Dec 2018, 7:08 pm
రాజకీయాల్లో బద్దశత్రువులుగా భావించే కాంగ్రెస్‌, టీడీపీ పార్టీలు కలిసి పనిచేయడంపై ఆపద్ధర్మ మంత్రి, టీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ సెటైర్‌ వేశారు. దాంతో పాటు తెలంగాణలో కరెంట్‌ ఉందా అని ప్రశ్నించే మోదీకి ఘాటు బదులిచ్చారు. జగిత్యాలలో జరిగిన టీఆర్‌ఎస్‌ ప్రచారం కార్యక్రమంలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. టీడీపీ, కాంగ్రెస్‌ల కలయిక పాము, ముంగిసలు ఏకమైనట్లు కనిపిస్తుందని ఎద్దేవా చేశారు.
Samayam Telugu KTR


జగిత్యాల సభలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘టీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణలో కరెంట్‌ ఉందా.. లేదా అని ప్రధాని నరేంద మోదీకి ఇప్పటికీ సందేహం ఉంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడికి వచ్చిన ఆయన కరెంట్‌ వైర్లు పట్టుకొని చూస్తే తెలంగాణ పవర్‌ ఏంటో మోదీకి తెలుస్తుంది. కొత్త రాష్ట‍్రంలో ఒక్కో ఇటుక పేర్చుతూ బంగారు తెలంగాణను నిర్మిస్తున్నాం. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గెడ్డం తీయకపోతే తెలంగాణకు పెద్ద నష్టం ఏమీ లేదు. కానీ గెడ్డం తీయకపోతే సన్యాసుల్లో కలవాల్సిందేనంటూ’ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.