యాప్నగరం

'మహా కూటమి' దుష్టచతుష్టయం.. ప్రజలే బుద్ధి చెబుతారు: ఎంపీ కవిత

మహా కూటమి తెలంగాణ ప్రజల పాలిట శాపం.. మహా కూటమిని ప్రజలు తప్పికొట్టడం ఖాయం..

Samayam Telugu 19 Sep 2018, 3:49 pm
తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేడి మొదలయ్యింది. పార్టీలన్నీ ఓవైపు వ్యూహాలు సిద్ధం చేసుకుంటూనే.. మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి. టీఆర్ఎస్‌ను మహాకూటమిగా ఏర్పడిన విపక్షాలు టార్గెట్ చేస్తే.. అధికార పార్టీ నుంచి అదే రేంజ్‌లో కౌంటర్లు పడుతున్నాయి. తాజాగా మహాకూటమిపై విరుచుకుపడ్డారు ఎంపీ కవిత. ఆ కూటమిని దుష్టచతుష్టయంగా పోల్చారు. తెలంగాణపై ప్రేమలేని పార్టీలు కూటమి కట్టి.. ప్రజల ముందుకు వస్తున్నాయని వ్యాఖ్యానించారు కవిత. ఈ కూటమిని ప్రజలు తిప్పికొట్టడం ఖాయమన్నారు.
Samayam Telugu Kavitha


మహా కూటమి ప్రజల పాలిట శాపంగా పోల్చారు కవిత. గతంలో పాలించిన కాంగ్రెస్, టీడీపీలు ప్రజల్ని పీక్కుతున్నాయని.. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు అనైతికమన్నారు. ఓట్ల గల్లంతు విషయంలో కాంగ్రెస్‌ పార్టీ కావాలనే తమ పార్టీపై బురదజల్లుతోందని.. ఓట్ల వ్యవహారం ఎన్నికల కమిషన్‌ పరిధిలోకి వస్తుందని గుర్తు పెట్టుకుంటే మంచిదన్నారు. గత అరవై ఏళ్లలో జరగని అభివృద్ధిని సీఎం కేసీఆర్ ఈ నాలుగేళ్లలో చేసి చూపించారని.. రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో ప్రజలు కూడా గమినిస్తున్నారన్నారు కవిత.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.