యాప్నగరం

ఆస్పత్రి నుంచి దీదీ డిశ్చార్జ్.. డాక్టర్ల మాట పక్కనబెట్టి!

Kolkata: కాలికి గాయంతో ఆస్పత్రిలో చేరిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిశ్చార్జ్ అయ్యారు. మరో 48 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి ఉన్నా.. తన నివాసానికి వెళ్లిపోయారు.

Samayam Telugu 12 Mar 2021, 10:48 pm
శ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. డాక్టర్ల సూచనలను తోసిపుచ్చి ఆమె తన నివాసానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మరో 48 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సినప్పటికీ.. మమతా బెనర్జీ అభ్యర్థన మేరకు ఆమెను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశామని వైద్యులు తెలిపారు. దీదీ డిశ్చార్జ్ అవుతున్న విషయం తెలుసుకొని కొంత మంది కార్యకర్తలు, అభిమానులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. దీదీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.
Samayam Telugu మమతా బెనర్జీ డిశ్చార్జ్
Mamata Banerjee Discharge


కాలికి గాయంతో మమతా బెనర్జీ కోల్‌కతాలోని SSKM ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. రెండు రోజుల పాటు చికిత్స తీసుకున్న మమతా బెనర్జీ శుక్రవారం (మార్చి 12) సాయంత్రం డిశ్చార్జ్ అయ్యారు. ఆస్పత్రి నుంచి ఆమె వీల్‌చైర్‌లో బయటకొచ్చారు. తన అనుచరుల సాయంతో కారెక్కి నివాసానికి బయల్దేరారు.

మమతా బెనర్జీపై కుట్రపూరితంగానే హత్యాయత్నం చేశారని తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. ఈ ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల అధికారి సునీల్‌ అరోరాను కలిసిన పార్టీ బృందం.. ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేపట్టాలని కోరింది. గతంలో సోషల్‌ మీడియా వేదికగా బీజేపీ నేతలు ముఖ్యమంత్రిపై బెదిరింపులకు పాల్పడ్డారని టీఎంసీ ఆరోపించింది. మరోవైపు.. మమతా బెనర్జీపై దాడికి నిరసనగా పార్టీ కార్యకర్తలు ‘నిశ్శబ్ద మార్చ్‌’ చేపట్టారు.

Don't Miss: కన్నీటి దృశ్యం: బిడ్డను కాపాడి ప్రాణాలు విడిచిన ఏనుగు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.