యాప్నగరం

West Bengal: దీదీ సంచలన ట్వీట్.. ఈసీ ఏమంటుందో.!

కరోనా కేసులు తీవ్రంగా పెరిగిపోతున్నాయి. ఇలాంటి సమయంలో ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మిగిలిన నాలుగు విడతల ఎన్నికలను కుదించాలని దీదీ ట్వీట్ చేశారు.

Samayam Telugu 15 Apr 2021, 11:03 pm
దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. నిన్న ఒక్కరోజే రెండు లక్షలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి జరగాల్సిన మిగిలిన నాలుగు విడతల ఎన్నికలను ఒకే రోజు నిర్వహించే అవకాశముందన్న ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ రోజు అఖిల పక్ష సమావేశం నిర్వహించిన ఎన్నికల కమిషన్ అలాంటి ప్రతిపాదన కానీ.. ఆలోచన కానీ తమకు లేదని స్పష్టం చేసింది. ఈసీ ప్రకటన అనంతరం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన ట్వీట్ చేశారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
mamata


కరోనా తీవ్రత దృష్ట్యా నాలుగు విడతల ఎన్నికలను కుదించి ఒకే దశలో నిర్వహించాలంటూ ఆమె చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ఎన్నికలను 8 దశల్లో నిర్వహించాలన్న ఈసీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు దీదీ చెప్పారు. కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్న పరిస్థితుల్లో మిగిలిన నాలుగు విడతల ఎన్నికలను కుదించాలని ఆమె అన్నారు. నాలుగు విడతల ఎన్నికలను ఇకే దశలో నిర్వహించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అలా చేయడం ద్వారా ప్రజలను కరోనా బారినుంచి కాపాడినట్లు అవుతుందని ఆమె ఈసీకి సూచించారు. ఎన్నికలను కుదించే అవకాశం లేదని ఇప్పటికే స్పష్టం చేసిన ఈసీ.. మమతా ట్వీట్‌పై ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.