యాప్నగరం

మోదీ వర్సెస్ మమతా.. మధ్యలో అసద్.! ఆడిస్తోంది బీజేపీనే..

పశ్చిమ బెంగాల్‌ను బీజేపీ నాశనం చేస్తోంది. హిందూ, ముస్లింల విభజన రాజకీయాలకు తెరతీసింది. ఏఐఎంఐఎం, ఐఎస్‌ఎఫ్ పార్టీలకు డబ్బులిచ్చి.. ఆ పార్టీలను వాడుకుంటోందని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు.

Samayam Telugu 3 Apr 2021, 7:42 pm
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ మాటల యుద్ధం ముదురుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో రెండు దశల పోలింగ్ పూర్తయింది. ఈ నెల 6వ తేదీన మూడో దశ పోలింగ్ జరగనుంది. ఎలాగైనా ఈసారి బెంగాల్‌లో జెండా ఎగరేయాలని చూస్తున్న బీజేపీకి ధీటుగా బదులిస్తున్నారు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ. బీజేపీ కుటిల రాజకీయాలకు పాల్పడుతోందని తీవ్రంగా విరుచుకుపడుతున్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
asad


హిందూ, ముస్లింలు కలసి మెలసి దుర్గామాతకి పూజలు చేయడం మన సంస్కృతి అని దీదీ అన్నారు. కానీ బీజేపీ హిందూ, ముస్లిం విభజన రాజకీయాలకు తెరతీసిందని ఆమె ఆరోపించారు. అందులో భాగంగానే ఏఐఎంఐఎం, ఐఎస్‌ఎఫ్ పార్టీలను వాడుకుంటోందని ఆమె అన్నారు. హిందూ, ముస్లింలను విభజించడానికి ఆ పార్టీలకు బీజేపీ డబ్బులిచ్చిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. మజ్లిస్, ఐఎస్‌ఎఫ్ పార్టీలకి ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని ఆమె చెప్పారు. బీజేపీ నేతలు బెంగాల్‌ను నాశనం చేస్తున్నారని మమతా మండిపడ్డారు. బయటి నుంచి వచ్చిన బీజేపీ గూండాలకు ఓటు వేయొద్దని ఆమె పిలుపునిచ్చారు.

పశ్చిమ బెంగాల్‌లో పర్యటించిన ప్రధాని మోదీ అదేరీతితో మమతా బెనర్జీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రెండో దశ పోలింగ్‌ జరిగిన నందిగ్రామ్‌లో మమతా ఓడిపోతారని ఆమె ప్రవర్తన చూస్తే అర్థమవుతోందని.. అందుకే మరో నియోజకవర్గంలో పోటీ చేసేందుకు ఆమె సిద్ధమవుతున్నారని పుకార్లు వస్తున్నాయని మోదీ అన్నారు. దీదీ.. ఓ దీదీ అది నిజమేనా అంటూ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రిని ఉద్దేశించి ప్రధాని చేసిన వ్యాఖ్యలు పశ్చిమ బెంగాల్‌లో తీవ్ర దుమారం రేపాయి.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.