యాప్నగరం

ఓటమి భయంతోనే ముందస్తు.. కేసీఆర్ మాట తప్పారు: జీవీఎల్

గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేసీఆర్ విఫలమయ్యారు. ఓటమి భయంతోనే ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు విమర్శించారు.

Samayam Telugu 4 Oct 2018, 1:10 pm
వచ్చే ఏడాది ఎన్నికలు జరిగితే ఓడిపోతాననే భయంతోనే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు తెర తీశారని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహ రావు విమర్శించారు. నాంపల్లిలోని బీజేపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన ఆయన టీఆర్ఎస్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్న ఆయన.. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన కేసీఆర్.. నాలుగున్నరేళ్లలో కేవలం 15 వేల ఉద్యోగాలను మాత్రమే ఇచ్చారన్నారు.
Samayam Telugu gvl1.


దళితుణ్ని సీఎం చేస్తామని మాటిచ్చిన కేసీఆర్ మాట తప్పారని జీవీఎల్ విమర్శించారు. ఎస్సీ, ఎస్టీలకు 16 శాతం రిజర్వేషన్లు, మూడెకరాల భూమి ఇస్తామని గత ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ ఉంచింది. కానీ అవేవీ అమలు చేయలేదని బీజేపీ నేత దుయ్యబట్టారు.

‘తెలంగాణ సమాజం క్షమించాలని కోరుకునే పరిస్థితి టీఆర్ఎస్‌‌ది. ఒక్క మహిళకు కూడా కేబినెట్‌లో స్థానం కల్పించలేదు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ ఉంటుంద’ని జీవీఎల్ తెలిపారు.
Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.