యాప్నగరం

Jr NTR: క్యూలైన్‌లో నిలబడి ఓటేసిన ఎన్టీఆర్, అల్లు అర్జున్

హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లో హీరోలు ఎన్టీఆర్, అల్లు అర్జున్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సామాన్య ప్రజలతో కలిసి క్యూలైన్‌లో నిలబడి వీరు ఓటు వేశారు.

Samayam Telugu 11 Apr 2019, 8:51 am
దేశ వ్యాప్తంగా తొలిదశ సార్వత్రిక ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి అన్ని చోట్లా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక, తెలంగాణలో ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లో హీరోలు ఎన్టీఆర్, అల్లు అర్జున్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సామాన్య ప్రజలతో కలిసి క్యూలైన్‌లో నిలబడి వీరు ఓటు వేశారు. ఎన్టీఆర్ తన తల్లి షాలిని, భార్య లక్ష్మీ ప్రణతితో కలిసి ఓటేశారు.
Samayam Telugu Bunny_NTR


ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ.. ‘5 సంవత్సరాలకు ఒక సారి వచ్చే అవకాశం ఓటు హక్కు వినియోగించుకోవడం.. ఇది మన భవిష్యత్తు, బాధ్యత. ఓటు వేసే వారికే అడిగే హక్కు ఉంటుంది. అందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి’ అని అన్నారు.
కాగా, తెలంగాణలోని 17 స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. మూడు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు రెండోసారి టీఆర్ఎస్‌కు పట్టం కట్టారు. ఈసారి కూడా ఓటర్లు తమవైపే ఉన్నారని, 16 స్థానాలు గెలిచితీరతామని టీఆర్ఎస్ ధీమాగా ఉంది. అసెబ్లీ ఎన్నికల్లో కేవలం 19 స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్‌ ఈ ఎన్నికల్లో అయినా సత్తా చాటాలని చూస్తోంది. ఇక ఒకే ఒక్క శాసనసభ స్థానంలో గెలిచిన బీజేపీ.. మోదీ చరిస్మా తమ పనికొస్తుందని భావిస్తోంది.

ఇదిలా ఉంటే, నిజామాబాద్‌తోపాటు సమస్యాత్మక ప్రాంతాలు మినహా మిగిలిన చోట ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ప్రధాన పార్టీలు, స్వతంత్య్ర అభ్యర్థులుగా రంగంలోకి దిగిన రైతులు కలిపి మొత్తం 185 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక్కడ ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.