యాప్నగరం

అమిత్ ‘షా’క్.. బీజేపీ టోపీ పెట్టుకోని మనవరాలు

బీజేపీ చీఫ్ అమిత్ షా గాంధీనగర్‌ లోక్ సభ స్థానానికి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో షా మనవరాలు.. ఆయనకు షాకిచ్చింది.

Samayam Telugu 30 Mar 2019, 4:24 pm
గాంధీనగర్‌: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా శనివారం గాంధీనగర్‌ లోక్‌సభ స్థానానికి నామినేషన్‌ దాఖలు చేశారు. భారీ జనంతో కలిసి ర్యాలీగా వెళ్లి ఆయన నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ సీనియర్ నేతలు రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, శివనసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే తదితరులు హాజరయ్యారు. 1998 నుంచి 2014 వరకు ఈ స్థానం నుంచి బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ పోటీ చేశారు. అమిత్ షా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తుండటం ఇదే తొలిసారనే సంగతి తెలిసిందే.

అమిత్ షా నామినేషన్ వేయడానికి ముందు.. ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. ఆయన తన మనవరాలికి బీజేపీ కార్యకర్తలు ధరించే కాషాయ రంగు టోపీ పెట్టడానికి ప్రయత్నించారు. కానీ ఆ పాప మాత్రం దాన్ని పెట్టుకోవడానికి ససేమీరా ఒప్పుకోలేదు. ఆ టోపీని తీసేసి.. అందంగా ఉన్న తన టోపీనే పెట్టుకుంది. పాప బీజేపీ టోపీని వద్దంటున్న వీడియో వైరల్‌గా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.