యాప్నగరం

Exit polls 2014.. లోక్‌సభ ఫలితాల్లో ఎవరి అంచనాలు ఫలించాయి?

2014 సార్వత్రిక ఎన్నికల్లో ఏ ఏజెన్సీ అంచనాలు ఫలించాయి. బీజేపీ హవాను కరెక్టుగా అంచనా వేసి ఖచ్చితమైన సంఖ్యలు చెప్పిన సంస్థలేవీ?

Samayam Telugu 18 May 2019, 9:27 pm
రికొద్ది గంటల్లో 2019 సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. ఆదివారం తుది విడత పోలింగ్ ముగియగానే వివిధ మీడియా సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడవుతాయి. ఈ నేపథ్యంలో 2014లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలేమిటీ? ఏ సంస్థ చెప్పిన అంచనాలు ఫలించాయి? 543 స్థానాల్లో ఎవరికి ఎన్ని సీట్లు? తదితర విషయాలు మీ కోసం.
Samayam Telugu Unబtled1


ఏజెన్సీకాంగ్రెస్బీజేపీ
టైమ్స్ నౌ/ఇండియా టీవీ/సిఓటర్89202
ఏబీపీ న్యూస్/నిల్సన్92236
సీఎన్ఎన్ ఐబీఎన్‌/లోక్‌నీతి/సీఎస్‌డీఎస్94 నుంచి 110193 నుంచి 213
ఎన్డీటీవీ92226
సీఎన్ ఐబీఎన్/లోక్‌నీతి/సీఎస్‌డీఎస్111 నుంచి 123234 నుంచి 246
టుడేస్ చాణక్య29157
2014 ఎన్నికల ఫలితాలు 28244

2014లో బీజేపీ గెలుస్తుందని అంచనా వేసినా ప్రభంజనం సృష్టిస్తుందని అంచనా వేయలేకపోయారు. అలాగే, కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని కూడా ఊహించలేకపోయారు. పైన పేర్కొన్న ఎగ్జిట్ పోల్స్‌లో ‘టుడేస్ చాణక్య’ అంచనాలు నిజమయ్యాయి. బీజేపీ 291 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేయగా.. తొలిసారిగా మెజారిటీ మార్క్ 272 సీట్లను దాటి 282 సీట్లు సాధించింది. ఎన్డీయేకు 340 సీట్లు లభిస్తాయని అంచనా వేయగా ఫలితాల్లో 326 సీట్లు లభించాయి. మరి ఈసారి ఎవరి అంచనాలు ఫలిస్తాయో చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.