యాప్నగరం

Priyanka Gandhi కాదు, వారణాసి కాంగ్రెస్ అభ్యర్థిగా రాయ్.. బీజేపీ ట్రోలింగ్

నరేంద్ర మోదీ వర్సెస్ ప్రియాంక గాంధీ పోరు లేదని తేలిపోయింది. వారణాసి నుంచి కాంగ్రెస్ తరఫున అజయ్ రాయ్ మరోసారి బరిలో నిలుస్తున్నారు.

Samayam Telugu 25 Apr 2019, 3:17 pm
ప్రధాని నరేంద్ర మోదీకి పోటీగా వారణాసి నుంచి కాంగ్రెస్ తరఫున ప్రియాంక గాంధీ పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారానికి తెరపడింది. కాంగ్రెస్ అభ్యర్థిగా వారణాసి నుంచి అజయ్ రాయ్ మరోసారి బరిలో నిలుస్తున్నారు. రాహుల్ గాంధీ ఆదేశిస్తే వారణాసి నుంచి పోటీ చేయడం తనకు సమ్మతమేనని గతంలో ప్రియాంక తెలిపారు. ఇదే ప్రశ్న కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌ను అడగ్గా.. సస్పెన్స్ అంటూ ఆయన సమాధానం దాటేశారు. సోనియా పోటీ చేస్తున్న రాయ్ బరేలీ నుంచి మీరు తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తారా? అని మీడియా ప్రియాంకను ప్రశ్నించగా.. వారణాసి ఎందుకు కాకూడదని ఆమె బదులిచ్చారు.
Samayam Telugu Modi-vs-Priyanka


అజయ్ రాయ్‌ను మరోసారి వారణాసి అభ్యర్థిగా కాంగ్రెస్ బరిలో నిలపడంతో.. బీజేపీ నేతలు హస్తం పార్టీపై సెటైర్లు వేస్తున్నారు. ఓటమి భయంతోనే ప్రియాంక అక్కడి నుంచి పోటీ చేయాలనే ఆలోచనను విరమించుకున్నారని ఎద్దేవా చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు ఆమెను ఇందిరా గాంధీతో పోలుస్తున్నారు కదా.. ఆమె మోదీపై ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు.
2014 ఎన్నికల్లో వారాణాసి నుంచి నరేంద్ర మోదీపై ఆమ్ ఆద్మీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో మోదీకి 5.81 లక్షల ఓట్లు రాగా.. అరవింద్ కేజ్రీవాల్‌కి 2.09 లక్షల ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్‌కి 75 వేలకుపైగా ఓట్లు దక్కాయి. వారాణాసి నుంచి ఈసారి నిజామాబాద్ రైతులు కూడా పోటీకి సిద్ధపడుతున్న సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.