యాప్నగరం

స్మృతి ఇరానీ విద్యార్హతలు మరోసారి వివాదాస్పదం!

స్మృతి ఇరానీ విద్యార్హతల విషయం మరోసారి వివాదాస్పదమైంది. ఈసీకి సమర్పించిన అఫిడవిట్లో తాను ఇంటర్ మాత్రమే చదినట్టు ఆమె పేర్కొన్నారు.

Samayam Telugu 12 Apr 2019, 5:38 pm
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విద్యార్హతల విషయం మరోసారి వివాదాస్పదమైంది. అమేథీలో నామినేషన్ వేసిన ఆమె అఫిడవిట్లో డిగ్రీ పూర్తి చేయలేదని తెలిపారు. కానీ 2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో.. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి 1994లో డిగ్రీ పూర్తి చేసినట్లు ఆమె పేర్కొన్నారు. దీంతో స్మృతి ఇరానీ తప్పుడు విద్యార్హతలను ఈసీకి సమర్పించారని, అబద్ధాలు ఆడుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.
Samayam Telugu smriti irani


కాంగ్రెస్ పార్టీ విమర్శల పట్ల ఇరానీ స్పందించారు. తాను డిగ్రీ చదివేందుకు ఢిల్లీ యూనివర్సిటీలో చేరాను, కానీ పూర్తి చేయలేదని ఆమె వివరణ ఇచ్చారు. స్మృతి ఏం చదివారనేది మాకు అనవసరం, కానీ విద్యార్హతల విషయంలో ఆమె అబద్ధాలు ఆడుతున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి చతుర్వేది వ్యాఖ్యానించారు.

తాను అమెరికాలోని యేల్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొందినట్లు గతంలో స్మృతి ఇరానీ మీడియాకు తెలిపారు. ఆమెకు యేల్ డిగ్రీ ఉంటే 2014లో ఈసీకి సమర్పించిన అఫిడవిట్‌లో ఎందుకు పొందుపర్చలేదని కాంగ్రెస్ ప్రశ్నించింది.

2014 ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రత్యర్థిగా స్మృతి ఇరానీ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో రాహుల్ 1.07 లక్షల ఓట్ల తేడాతో గెలిచారు. కానీ 2009 ఎన్నికల్లో ఆయన 3.70 లక్షల మెజార్టీతో విజయం సాధించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.