యాప్నగరం

Congress Second List: కాంగ్రెస్ రెండో జాబితాలోనూ అదే స్ట్రాటజీ, బరిలో హీరో సోదరి

మార్చి 7న లోక్ సభ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన కాంగ్రెస్ వారం వ్యవధిలో రెండో జాబితాను ప్రకటించింది. ఈసారి 20 మంది అభ్యర్థుల జాబితాను వెల్లడించింది. యూపీ, మహారాష్ట్ర నుంచి ఈ జాబితాను రూపొందించింది.

Samayam Telugu 13 Mar 2019, 10:26 pm

ప్రధానాంశాలు:

  • మార్చి 7న లోక్ సభ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన కాంగ్రెస్ వారం వ్యవధిలో రెండో జాబితాను ప్రకటించింది.
  • ఈసారి 20 మంది అభ్యర్థుల జాబితాను వెల్లడించింది.
  • యూపీ, మహారాష్ట్ర నుంచి ఈ జాబితాను రూపొందించింది.
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu congress1
లోక్ సభ ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ దూకుడు కనబరుస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటనకు ముందే తొలి జాబితాను ప్రకటించిన హస్తం పార్టీ.. తాజాగా రెండో జాబితాను ప్రకటించింది. తొలి విడతలో 15 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించిన కాంగ్రెస్.. 21 మందితో మలి విడత జాబితాను విడుదల చేసింది. మొదటి విడతలో గుజరాత్ నుంచి నాలుగు స్థానాలు, యూపీ నుంచి 11 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది.
బుధవారం ప్రకటించిన జాబితాలో మహారాష్ట్రలో ఐదు స్థానాలకు, ఉత్తర ప్రదేశ్‌లో 15 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచే కాంగ్రెస్ రెండు జాబితాలను ప్రకటించడం గమనార్హం. సీనియర్ నాయకుడు రాజ్ బబ్బర్ మోరాదాబాద్ నుంచి పోటీ చేయనుండగా.. సంజయ్ దత్ సోదరి ప్రియాదత్ ముంబై నార్త్ సెంట్రల్ నుంచి బరిలో దిగనున్నారు. ప్రియాంక గాంధీకి సన్నిహితుడిగా పేర్కొంటున్న లలితేశ్ పాటి త్రిపాఠి మీర్జాపూర్ నుంచి పోటీ చేయనున్నాడు.
దివంగత సునీల్ దత్ కుమార్తె అయిన ప్రియాదత్ 2005లో ముంబై నార్త్ వెస్ట్ నుంచి తొలిసారి ఎన్నికల బరిలో నిలిచి గెలుపొందారు. 2009లో ముంబై సెంట్రల్ నుంచి గెలిచిన ఆమె.. తర్వాతి ఎన్నికల్లో పూనమ్ మహాజన్ చేతిలో ఓడారు. ఈసారి ఎన్నికల బరిలో దిగడం లేదని రెండు నెలల క్రితం ఆమె ప్రకటించారు. అభ్యర్థుల జాబితా ప్రకటనకు కొద్ది గంటల ముందు ఆమె తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.