యాప్నగరం

Mandya Election Result: హోరాహోరీ పోరులో గెలిచి నిలిచిన నటి సుమలత.. సీఎం కుమారుడిపై విజయం

మండ్య స్థానం నుంచి నటి సుమలత స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. హోరాహోరీ పోరులో సీఎం కుమారస్వామి తనయుడిపై స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు.

Samayam Telugu 23 May 2019, 7:33 pm
టి సుమలత మండ్య సెంటిమెంట్ రిపీట్ చేశారు. ఆ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. హోరాహోరీ పోరులో సమీప ప్రత్యర్థి జేడీఎస్ అభ్యర్థి నిఖిల్‌పై 580 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు. దివంగత నటుడు, కాంగ్రెస్‌ మాజీ ఎంపీ అంబరీశ్‌ సతీమణిగా సుమలత రాజకీయ ప్రవేశం కన్నడనాట ఎన్నో నాటకీయ పరిణామాలకు దారి తీసిన విషయం తెలిసిందే. మండ్య నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున మూడు సార్లు ఎంపీగా గెలిచిన అంబరీశ్‌ గతేడాది అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో ఈ స్థానం నుంచి పోటీ చేయడానికి సుమలత సిద్ధమవగా.. కాంగ్రెస్ నుంచి టికెట్ లభించలేదు.
Samayam Telugu Sumalatha
సుమలత


కాంగ్రెస్ పొత్తు ధర్మంలో భాగంగా మండ్య సీటును జేడీఎస్‌కు కేటాయించింది. జేడీఎస్‌ ఈ స్థానం నుంచి సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్‌‌ను బరిలోకి దింపింది. దీంతో సుమలతకు చుక్కెదురైంది. నిఖిల్ కూడా సినీనటుడే కావడం గమనార్హం. కానీ, ఆమె అధైర్యానికి గురవ్వలేదు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు.

మాజీ ప్రధాని దేవేగౌడ కుమారుడైన నిఖిల్‌ తాజా ఎన్నికలతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తమకు పట్టున్న మండ్య నుంచి నిఖిల్‌ను బరిలో దింపింది జేడీఎస్‌. ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏమిటంటే.. సుమలతకు మద్దతిచ్చేందుకు బీజేపీ ఈ స్థానంలో అభ్యర్థిని కూడా నిలబెట్టలేదు. దీంతో మండ్య పోరు ఆసక్తికరంగా మారింది..

ఇంతటి ప్రతిష్టాత్మక పోరులో సుమలతె గెలిచి నిలిచారు. నిఖిల్‌పై సుమలత విజయం సాధించారు. కన్నడ సినీప్రముఖులు కూడా సుమలతే మద్దతుగా నిలిచారు. తెలిగింటి ఆడపడచైన సుమలతకు ఇటు టాలీవుడ్ కూడా అండగా నిలిచింది. దీంతో హోరాహోరీ పోరులో గెలుపొందిన సుమలత.. భర్త అడుగు జాడల్లో తొలిసారిగా లోక్‌సభలో అడుగుపెడుతున్నారు. అంతేకాకుండా మండ్య స్థానం నుంచి 52 ఏళ్ల తర్వాత లోక్‌సభకు వెళ్తున్న తొలి మహిళా స్వతంత్ర ఎంపీగా రికార్డు సృష్టించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.