యాప్నగరం

‘ఈవీఎంలపై నిందలొద్దు.. ఓటమిని హుందాగా అంగీకరించండి’

ఈవీఎంలపై నిందలు వేయడం మానుకోవాలని.. ఓటమిని హుందాగా అంగీకరించాలని ప్రతిపక్షాలకు న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సూచించారు. ఆరోపణలు చేస్తున్న వారంతా ఈవీఎంలతో గెలిచిన వారేనన్నారు.

Samayam Telugu 22 May 2019, 3:49 pm
వీఎంలపై విపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఘాటుగా స్పందించారు. ఓటమిని హుందాగా అంగీకరించాలని.. ఈవీఎంలపై నిందలు వేయడం ఇకనైనా మానుకోవాలని సూచించారు. ఈవీఎంల‌తో ఎలాంటి స‌మ‌స్య లేద‌ని స్పష్టం చేశారు. ఇవే ఈవీఎంలతో బెంగాల్‌లో మ‌మ‌తా బెన‌ర్జీ రెండుసార్లు సీఎం అయ్యారని గుర్తుచేశారు. మాయావతి, అఖిలేశ్, అరవింద్ కేజ్రీవాల్, చంద్రబాబు నాయుడు ఈవీఎంల ద్వారానే గెలిచి సీఎంలు అయ్యార‌ని చెప్పారు. కానీ, ఇప్పుడు బీజేపీ గెలవబోతుందని తెలిసి ఈవీఎంలపై నెపం నెట్టుతున్నారని మండిపడ్డారు.
Samayam Telugu EVM


‘ఇవే ఈవీఎంలతో వారు గెలిచినప్పుడు ఎలాంటి సమస్యా లేదు. కానీ, ఇప్పుడు బీజేపీ గెలవబోతుందని తెలియగానే ఈవీఎంలతో వారికి సమస్య వచ్చింది. ఇంతకంటే దారుణమైన, దిగజారుడు, హాస్యాస్పదమైన వ్యాఖ్యలు మరోటి ఉండవు. ఓటమి నుంచి తప్పించుకోవడానికే ఈవీఎంలపై నిందలు వేస్తున్నారు’ అని రవిశంకర్ ప్రసాద్ దుయ్యబట్టారు.

ఈవీఎంల ప‌ట్ల ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని ర‌విశంక‌ర్ ప్రసాద్ పేర్కొన్నారు. ఈవీఎంలపై నిందలు మాని.. ఓటమిని హుందాగా అంగీకరించాలని విపక్షాలకు ఆయన సూచించారు. మంగళవారం (మే 21) న్యూస్ ఏజెన్సీ ఏఎన్‌ఐ ప్రతినిధితో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.