యాప్నగరం

నాథూరాం గాడ్సే నిజమైన దేశ భక్తుడు.. బీజేపీ ఎంపీ అభ్యర్థి సాధ్వీ వ్యాఖ్యలు

మహాత్మా గాంధీని చంపిన నాథూరాం గాడ్సే దేశభక్తుడని బీజేపీ ఎంపీ అభ్యర్థి సాధ్వీ వ్యాఖ్యానించారు. స్వతంత్ర భారతంలో తొలి ఉగ్రవాది హిందువేనన్న కమల్ వ్యాఖ్యలకు స్పందనగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 16 May 2019, 4:01 pm
మహ్మాతా గాంధీని కాల్చి చంపిన నాథూరాం గాడ్సే దేశ భక్తుడని బీజేపీ తరఫున భోపాల్ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్ తెలిపారు. గాడ్సేను ఉగ్రవాది అని పిలుస్తున్న వారికి ఎన్నికల్లో ప్రజలు దిమ్మతిరిగే సమాధానం ఇస్తారని ఆమె చెప్పారు. గాడ్సే ఎప్పటికీ దేశభక్తుడేనని ఆమె చెప్పారు. స్వతంత్ర భారతంలో తొలి ఉగ్రవాది హిందువని గాడ్సేను ఉద్దేశించి ఇటీవల కమల్ హాసన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కమల్ వ్యాఖ్యలకు కౌంటర్‌గానే సాధ్వీ ఈ వ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu sadhvi1


కమల్ హాసన్‌ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. కమల్‌పై క్రిమినల్ కేసు కూడా నమోదైంది. కాగా తాను టెర్రరిస్ట్ అనే పదమే వాడలేదని కమల్ హాసన్ వివరణ ఇచ్చారు.

2008 మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో అరెస్టై.. బెయిల్ మీద విడుదలైన సాధ్వీ.. కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్‌పై ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. తను శపించడం వల్లే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) చీఫ్ హేమంత్ కర్కరే చనిపోయారన్న సాధ్వీ.. అనంతరం క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.