యాప్నగరం

జాబ్స్ కోసం ‘ఫేస్‌బుక్‌’ కొత్త ఫీచర్‌!

సోషల్‌ మీడియా దిగ్గజం ‘ఫేస్‌బుక్‌’ మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది.

TNN 17 Feb 2017, 2:49 pm
సోషల్‌ మీడియా దిగ్గజం ‘ఫేస్‌బుక్‌’ మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. యూజర్లు వారికి సరిపోయే ఉద్యోగాలను అన్వేషించుకోవడంతో పాటు.. అక్కడే దరఖాస్తు చేసుకునే విధంగా ఈ ఫీచర్ ద్వరా సదుపాయం కల్పించనుంది. దీని ద్వారా సంస్థలకు కూడా మేలు కలగనుంది. ఇప్పటి వరకూ ఒక్కో సోషల్‌మీడియా వెబ్‌సైట్ కు చెక్ పెడుతూ వస్తున్న ఫేస్ బుక్ ఈ ఫీచర్ ద్వారా త్వరలో ప్రముఖ జాబ్‌పోర్టల్‌ లింక్డ్‌ఇన్‌కు షాక్‌ ఇవ్వబోతోంది.
Samayam Telugu facebook takes on linkedin introducing new job postings feature
జాబ్స్ కోసం ‘ఫేస్‌బుక్‌’ కొత్త ఫీచర్‌!


జాబ్స్ అందించదలిచే సంస్థలు ఇకపై నేరుగా ఫేస్‌బుక్‌లో ఓ పేజీని క్రియేట్‌ చేసుకోవచ్చు. అందులో ఏయే విభాగాల్లో ఖాళీలున్నాయో పేర్కొనవచ్చు. యూజర్లు తమ ఫేస్‌బుక్‌ అకౌంట్లో ‘జాబ్స్‌’ అనే ట్యాబ్‌ ద్వారా ఏయే సంస్థల్లో ఏయే ఉద్యోగాలున్నాయో తెలుసుకోవచ్చు. నచ్చితే వెంటనే ‘అప్లై’ బటన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అప్పటికే అందుబాటులో ఉన్న వివరాలతో ఫేస్‌బుక్కే కొన్ని కాలమ్స్ ఫిలప్ చేస్తుంది. అభ్యర్థి వాటిని అప్డేట్ చేసుకోవచ్చు.

జాబ్‌కు దరఖాస్తు చేసుకుంటే యూజర్‌కు, కంపెనీకి అనుసంధానంగా ఓ చాట్‌ బాక్స్‌ కూడా ఏర్పాటయ్యే సౌకర్యం కల్పించనున్నారట. ఇది అభ్యర్థులతో పాటు, సంస్థలకూ ఉద్యోగ నియామక ప్రక్రియను సులభతరం చేస్తుంది. నిపుణులైన ఉద్యోగుల కోసం అన్వేషించే సంస్థలకు దీనివల్ల ప్రయోజనం చేకూరనుంది. మొదట ఈ ఫీచర్‌ను అమెరికా, కెనడాలో అందుబాటులోకి తేనున్నారు. మన వరకూ రావాలంటే మరి కొంత కాలం ఆగాల్సిందే..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.