యాప్నగరం

బౌలర్లను భయపెట్టే డివిలియర్స్‌కు ‘ప్రేమ లేఖ’ భయం

సిక్సర్ల మోత మోగిస్తూ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించే ఏబీ డివిలియర్స్‌కు ప్రేమ లేఖల విషయంలో ఓ బలహీనత ఉందట.

TNN 3 May 2017, 7:28 pm
ఆధునిక క్రికెట్లో తిరుగులేని ఆటగాళ్లలో ఏబీ డివిలయర్స్ ఒకడు. సిక్సర్లతో విరుచుకుపడుతూ విధ్వంసం సృష్టించే ఈ సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్ క్రీజులో ఉండే కొండలాంటి లక్ష్యమైనా మంచులా కరిగిపోవాల్సిందే. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. ఫ్యాన్స్‌ను అలరించడంలో ఏబీ తర్వాతే ఎవరైనా. రాయల్ ఛాలెంజర్స్ తరఫున ఐపీఎల్ ఆడుతున్న ఈ క్రికెటర్‌కు భారత్‌లో బాగానే ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఈ డేంజర్ బ్యాట్స్‌మెన్‌కు మాత్రం ఓ బలహీనత ఉందండోయ్.
Samayam Telugu feared by bowlers ab de villiers was scared of writing love letters to girls
బౌలర్లను భయపెట్టే డివిలియర్స్‌కు ‘ప్రేమ లేఖ’ భయం


అదేంటో తెలుసా.. అమ్మాయిలకు తన ప్రేమను వ్యక్తం చేయాలంటే డివిలియర్స్‌కు సిగ్గుతో కూడిన భయమట. ముంబైలో జరిగిన ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్న డివిలియర్స్.. తన స్కూల్ డేస్‌ను గుర్తుకు తెచ్చుకున్నాడు. ‘అందమైన అమ్మాయిని చూస్తే అందరిలాగే నేను కూడా ఇష్టపడేవాణ్ని. చక్కగా లవ్ లెటర్ కూడా రాసేవాణ్ని. కానీ ఆ లెటర్ ఇవ్వాలంటే మాత్రం తెగ భయమేసేది. దీంతో ఆ లెటర్‌ ఇవ్వకుండానే ఇంటికి వెళ్లిపోయేవాణ్ని. ఇంటి పై కప్పు మీదకు ఎక్కి, ఆ లెటర్‌ను దాచేసేవాణ్ని’ అంటూ డివిలియర్స్ చెప్పాడు.


అలా ఒకటి కాదు రెండు కాదు.. పాఠశాల చదువు పూర్తయ్యే సమయానికి ఈ డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్ దగ్గర దాదాపు 30 లెటర్లు ఉండిపోయాయట. అమ్మాయిలకు ఇవ్వడానికి భయపడటం వల్లే ప్రేమ లేఖలు రాసినప్పటికీ వాటిని ఇవ్వలేకపోయినట్లు ఏబీ తెలిపాడు.

ఇదంతా గతం.. ఇప్పుడు డివిలియర్స్ బాగానే మారిపోయాడు. డానియెల్ పెళ్లాడిన ఏబీ.. తన భార్యకు మాత్రం ప్రేమ లేఖలను రాయడమే కాదు.. ఇస్తున్నాడు కూడా. ఈ మధ్యే తను ఇండియా నుంచి సౌతాఫ్రికా వెళ్లేటప్పుడు చిన్న లెటర్ రాసి దాన్ని ఆమె పాస్‌పోర్టులో ఉంచాడట. ఇంటికెళ్లాక దాన్ని చూసుకొని భర్తకు తనపై ఉన్న ప్రేమను తలచుకొని డానియెల్ మురిసిపోయిందట.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.