యాప్నగరం

89వ జెనీవా మోటార్ షో షురూ!

ప్రపంచంలోనే ఉత్తమమైన, యూరప్‌లో అతిపెద్ద ఆటో ఎగ్జిబిషన్‌గా గుర్తింపుతెచ్చుకున్న ‘జెనీవా మోటార్ షో’కు రంగం సిద్ధమైంది.

TNN 7 Mar 2017, 1:39 pm
ప్రపంచంలోనే ఉత్తమమైన, యూరప్‌లో అతిపెద్ద ఆటో ఎగ్జిబిషన్‌గా గుర్తింపుతెచ్చుకున్న ‘జెనీవా మోటార్ షో’కు రంగం సిద్ధమైంది. స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఈ మోటార్ షోను ఏటా నిర్వహిస్తారు. ఈ ఏడాది జరుగుతున్నది 89వ జెనీవా మోటార్ షో. మార్చి 9 నుంచి 19వ తేదీ వరకు ఈ షోను నిర్వహిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ ఆటో కంపెనీలు ఈ ఎగ్జిబిషన్‌లో పాల్గొనడంతో పాటు తమ కొత్త ఉత్పత్తులను ప్రదర్శిస్తాయి. అబార్త్, మెర్సిడెస్ బెంజ్, ఆడి, వోల్వో, బెంట్లే, బీఎండబ్ల్యూ, బుగాటి, టొయోటా, ఫోక్స్‌వ్యాగన్ వంటి దిగ్గజ కంపెనీలు ఈ షోలో పాల్గొంటాయి.
Samayam Telugu geneva motor show 2017 worlds best at europes biggest auto exhibition
89వ జెనీవా మోటార్ షో షురూ!


లగ్జరీ కార్ల నుంచి క్రాస్ఓవర్ వాహనాల వరకు అన్ని రకాల వాహనాల ప్రదర్శనకు ఈ షో వేదికవుతుంది. ఈ ఏడాది జెనీవా మోటార్ షోలో ఫోక్స్‌వ్యాగన్ రూపొందించిన డ్రైవర్ రహిత వాహనం ‘సెడ్రిక్’ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ‘సెడ్రిక్’ కాన్సెప్ట్ మోడల్‌ను ఈ షోలో ఫోక్స్‌వ్యాగన్ ప్రదర్శించనుంది. ఇప్పటికే ఈ కారును ఎగ్జిబిషన్‌లోని కంపెనీ పెవిలియన్ వద్ద ఉంచింది. అలాగే బుగాటి, బెంట్లే కార్లు కూడా కంపెనీ స్టాల్స్‌లో కొలువు దీరాయి.

కాగా, యురోపియన్ కార్ ఆఫ్ ది ఇయర్ 2017 అవార్డు ‘ప్యుగోట్’ బ్రాండ్‌ను వరించింది. ఈ మేరకు ‘ప్యుగోట్ 3008’ కార్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచినట్లు జెనీవా మోటార్ షోలో ప్రకటించారు. ఆల్ఫా రోమియో గిలియా, మెర్సిడెస్ ఇ-క్లాస్‌లను వెనక్కి నెట్టి ప్యుగోట్ 3008 ఎస్‌యూవీ బెస్ట్ కార్‌గా నిలిచింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.