యాప్నగరం

మళ్లీ ఆమ్లానే.. గుజరాత్ టార్గెట్ 189

ఆమ్లా ఫామ్‌ని కొనసాగిస్తూ గుజరాత్ బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. దీంతో పంజాబ్ స్కోరు పది రన్‌రేట్‌తో దూసుకెళ్లింది.

TNN 23 Apr 2017, 6:01 pm
ఐపీఎల్ పదో సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఓపెనర్ హసీమ్ ఆమ్లా సూపర్ ఫామ్‌ని కొనసాగిస్తున్నాడు. గుజరాత్ లయన్స్‌తో రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఆమ్లా (65: 40 బంతుల్లో 9x4, 2x6) అర్ధశతకం బాదడంతో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 7 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఓపెనర్ మనన్ వోహ్రా (2) ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే నాథూ సింగ్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్ ఇచ్చి ఔటవగా.. అనంతరం వచ్చిన షాన్ మార్ష్ (30: 24 బంతుల్లో 4x4, 1x6)తో కలిసి ఆమ్లా స్కోరు బోర్డుని నడిపించాడు. ముంబయితో రెండు రోజుల క్రితం జరిగిన మ్యాచ్‌లో శతకం బాదిన ఆమ్లా అదే ఫామ్‌ని కొనసాగిస్తూ గుజరాత్ బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. దీంతో పంజాబ్ స్కోరు పది రన్‌రేట్‌తో దూసుకెళ్లింది. అయితే ఇన్నింగ్స్ 10వ ఓవర్ వేసిన ఆండ్రూ టై అద్భుతమైన డెలివరీతో మార్షన్‌ని బుట్టలో వేయడంతో 81 పరుగుల వద్ద ఆ జట్టు రెండో వికెట్ కోల్పోయింది.
Samayam Telugu gl vs kxip 26th match ipl live score
మళ్లీ ఆమ్లానే.. గుజరాత్ టార్గెట్ 189


మార్ష్ అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ మాక్స్‌వెల్ (31: 18 బంతుల్లో 1x4, 3x6) ప్రతి బంతినీ సిక్సర్ బాదేయాలనే కసితో ఆడాడు. స్పిన్నర్ల బౌలింగ్‌లో ఎక్కువ స్విచ్ షాట్స్ ఆడేందుకు ప్రయత్నిస్తున్న మాక్స్‌వెల్‌ని రవీంద్ర జడేజా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అంకముందు ఓవర్‌లోనే ఆమ్లా కూడా ఔటవడంతో 132/4తో పంజాబ్ తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించింది. కానీ.. చివర్లో అక్షర్ పటేల్ (34: 17 బంతుల్లో 3x4, 2x6), సాహా (10 : 5 బంతుల్లో 1x6) బ్యాట్ ఝళిపించడంతో పంజాబ్ 188 పరుగులు చేయగలిగింది. గుజరాత్ బౌలర్లలో టై రెండు వికెట్లు తీయగా.. అగర్వాల్; నాథూసింగ్, జడేజా, డ్వేన్ స్మిత్ తలో వికెట్ తీశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.