యాప్నగరం

రాజ్‌కోట్‌లో ముంబయి టార్గెట్ 154

సీనియర్లు వెనుదిరుగుతున్నా దూకుడు ఏమాత్రం తగ్గించకుండా ఇషాన్ కిషన్ వరుస బౌండరీలతో రెచ్చిపోయాడు. మధ్యలో రవీంద్ర జడేజా (

TNN 29 Apr 2017, 9:46 pm
ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా ముంబయి ఇండియన్స్‌తో రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ లయన్స్ మొదట తడబడినా చివరికి నిలదొక్కుకుని 153 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేసింది. యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ (48: 35 బంతుల్లో 6x2, 2x6) మెరుపు బ్యాటింగ్‌తో ఆదిలోనే చెలరేగినా.. మెక్‌కలమ్ (6), కెప్టెన్ సురేశ్ రైనా (1), అరోన్ ఫించ్ (0), దినేశ్ కార్తీక్ (2) వరుసగా వికెట్లు చేజార్చుకోవడంతో 8.1 ఓవర్లు ముగిసే సమయానికి 56/4తో గుజరాత్ పీకల్లోతు కష్టాల్లో పడింది.
Samayam Telugu gl vs mi mumbai indians target
రాజ్‌కోట్‌లో ముంబయి టార్గెట్ 154


ఒక ఎండ్‌లో సీనియర్లు వెనుదిరుగుతున్నా దూకుడు ఏమాత్రం తగ్గించకుండా ఇషాన్ కిషన్ వరుస బౌండరీలతో రెచ్చిపోయాడు. మధ్యలో రవీంద్ర జడేజా (28: 21 బంతుల్లో 2x4, 1x6) కూడా ఈ కుర్రాడితో కలిసి బ్యాట్ ఝళిపించడంతో గుజరాత్ కోలుకుంది. కానీ.. ప్రమాదకరంగా మారిన ఈ జోడిని హర్భజన్ సింగ్ ఓపెనర్ కిషన్‌ని ఔట్ చేయడం ద్వారా విడదీశాడు. తర్వాత కొద్దిసేపటికే జడేజాతో పాటు ఇర్ఫాన్ పఠాన్ (2) కూడా వెనుదిరిగారు. దీంతో ఆ జట్టు మళ్లీ ఇబ్బందుల్లో పడింది. కానీ.. చివర్లో ఆండ్రూ టై (25: 12 బంతుల్లో 2x4, 2x6), ఫాల్కనర్ (21: 27 బంతుల్లో 2x4) నిలకడగా ఆడటంతో గుజరాత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేయగలిగింది. ముంబయి బౌలర్లలో క్రునాల్ పాండ్య మూడు వికెట్లు తీయగా.. బుమ్రా, మలింగ చెరో రెండు వికెట్లు.. హర్భజన్ సింగ్ ఒక వికెట్ తీశాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.