యాప్నగరం

గూగుల్ లెన్స్: స్మార్ట్‌ఫోన్ కెమెరానే సెర్చ్ బాక్స్

గూగుల్ I/O డెవలపర్ కాన్ఫరెన్స్ 2017లో గూగుల్ లెన్స్ అనే నూతన ఆవిష్కరణను కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించారు.

TNN 19 May 2017, 5:42 pm
సాఫ్ట్‌వేర్ రంగంలో కంపెనీలు వార్షిక సమావేశాలు నిర్వహించడమనేది ఒక సంప్రదాయంగా వస్తోంది. నూతన ఆవిష్కరణలు, ఉత్పత్తులు, సరికొత్త ఆలోచనలను షేర్ చేసుకునేందుకు సాఫ్ట్‌వేర్ సంస్థలన్నీ వార్షిక డెవలపర్ సదస్సులను నిర్వహిస్తాయి. ఈ వార్షిక డెవలపర్ సదస్సుల కోసం ఉద్యోగులతో పాటు టెక్నాలజీని ఇష్టపడేవారందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. మరి గూగుల్ లాంటి దిగ్గజ కంపెనీ వార్షిక డెవలపర్ సదస్సు నిర్వహిస్తుందంటే ఆసక్తి మరింత పెరుగుతుంది. గూగుల్ నుంచి ఈసారి కొత్త టెక్నాలజీ ఏం రాబోతోందా అని చూస్తాం.
Samayam Telugu o 2017 google lens turns your camera into a search box
గూగుల్ లెన్స్: స్మార్ట్‌ఫోన్ కెమెరానే సెర్చ్ బాక్స్


ఈ మేరకు కాలిఫోర్నియాలోని మౌంటెన్ వ్యూలో ఉన్న గూగుల్ కార్యాలయంలో మే 17 నుంచి గూగుల్ I/O డెవలపర్ కాన్ఫరెన్స్ 2017 ప్రారంభమైంది. ఈ సదస్సులో గూగుల్ కొన్ని కొత్త ఫీచర్లను ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్లకు కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఓ (O), కొత్త వీఆర్ హెడ్‌సెట్, గూగుల్ లెన్స్, ఐఫోన్‌లో గూగుల్ అసిస్టెంట్, గూగుల్ హోం వంటి కొత్త ఫీచర్లను కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించారు. అయితే వీటన్నింటిలోనూ ‘గూగుల్ లెన్స్’ టెక్ ప్రియులను ఎంతగానో ఆకర్షిస్తోంది. దీనికి కారణం మనం గూగుల్‌లో రోజూ చేసే మాన్యువల్ సెర్చ్ (సెర్చ్ బాక్సులో టైప్‌చేయడం) ఇకపై కనుమరుగు కావడమే.

ఇప్పటి వరకు మనం దేనిగురించైనా తెలుసుకోవాలంటే దాని పేరుని గూగుల్ సెర్చ్ బాక్సులో టైప్ చేసేవాళ్లం. అప్పుడు దానికి సంబంధించిన సమాచారం స్క్రీన్‌పై కనిపించేది. ఇప్పుడు అలా అవసరం లేదు. మీరు రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఓ హోటల్ కనిపించింది. ఆ హోటల్‌లో ఫుడ్ ఎలా ఉంటుందో గూగుల్ రేటింగ్ మీరు తెలుసుకోవాలనుకున్నారు. దీని కోసం మీరు చేయాల్సిందల్లా.. ఆ హోటల్ పేరును మీ కెమెరాతో స్కాన్ చేయడమే. దాన్ని ఆధారంగా తీసుకొని మీరు ఉన్న ప్రాంతం, హోటల్ రేటింగ్, రివ్యూస్ అన్నీ మీ ఫోన్ డిస్ప్లేపై ప్రత్యక్షమవుతాయి.

ఇదే కాదు మీ కనిపించే ఏ వస్తువైనా, పుస్తకంలో పేరైనా స్కాన్ చేసి దాని గురించి తెలుసుకోవచ్చు. దీనికి మీరు చేయాల్సిందల్లా.. మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ లెన్స్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవడమే. ఇమేజ్ సెర్చ్ అనే కాన్సెప్ట్‌తో గూగుల్ ఈ లెన్స్ టెక్నాలజీని తీసుకొచ్చింది. గూగుల్ లెన్స్ గురించి సుందర్ పిచాయ్ వివరించిన తీరు కూడా ఆకట్టుకుంది. గూగుల్ లెన్స్‌ని టెక్నాలజీలో మరో విప్లవంగా సుందర్ అభివర్ణించారంటే దీనికి కంపెనీ ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో అర్థమవుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.