యాప్నగరం

పంజాబ్‌పై ఫీల్డింగ్ ఎంచుకున్న గుజరాత్

ఓపెనర్ హసీమ్ ఆమ్లా శతకం బాదినా.. బౌలర్ల పేలవ ప్రదర్శనతో మ్యాచ్‌ని పంజాబ్ చేజార్చుకుంది. గుజరాత్ సొంత మైదానం రాజ్‌కోట్‌లో ఈ మ్యాచ్

TNN 23 Apr 2017, 3:46 pm
ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ లయన్స్ కెప్టెన్ సురేశ్ రైనా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టోర్నీలో ఆరు మ్యాచ్‌లాడిన గుజరాత్ రెండింట్లో మాత్రమే గెలుపొంది పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పడిపోయింది. అయితే కోల్‌కతాతో జరిగిన చివరి మ్యాచ్‌లో కెప్టెన్ సురేశ్ రైనా ఫామ్‌లో‌కి వచ్చి జట్టును గెలిపించడం గుజరాత్‌కి ఉపశమనం ఇచ్చేదే. మరోవైపు పంజాబ్ జట్టు తీవ్ర ఒత్తిడిలో బరిలోకి దిగుతోంది. ముంబయిపై ఆ జట్టు ఓపెనర్ హసీమ్ ఆమ్లా శతకం బాదినా.. బౌలర్ల పేలవ ప్రదర్శనతో మ్యాచ్‌ని పంజాబ్ చేజార్చుకుంది. గుజరాత్ సొంత మైదానం రాజ్‌కోట్‌లో ఈ మ్యాచ్ జరుగుతోంది. గత మ్యాచ్‌లో జట్టుకు దూరమైన మనన్ వోహ్రా, నటరాజన్, కరియప్పకి పంజాబ్ కెప్టెన్ మాక్స్‌వెల్ మళ్లీ తుదిజట్టులో అవకాశమిచ్చాడు.
Samayam Telugu gujarat lions opt to bowl
పంజాబ్‌పై ఫీల్డింగ్ ఎంచుకున్న గుజరాత్


గుజరాత్ లయన్స్
అరోన్ ఫించ్, మెక్‌కలమ్, సురేశ్ రైనా, దినేశ్ కార్తీక్, డ్వేన్ స్మిత్, రవీంద్ర జడేజా, అక్షదీప్ నాథ్, ఆండ్రూ టై, శుభమ్ అగర్వాల్, బసిల్ థంపీ, నాథూ సింగ్

పంజాబ్ జట్టు
హసీమ్ ఆమ్లా, మనన్ వోహ్రా, మాక్స్‌వెల్, సాహా, షాన్ మార్ష్, స్టాయినిస్, అక్షర్ పటేల్, కరియప్ప, నటరాజన్, మోహిత్ శర్మ, సందీప్ శర్మ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.