యాప్నగరం

నోగట్ 7.0 ఓఎస్ అప్‌డేట్ ఇలా !

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ తన సరికొత్త ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ 7.0 నోగట్ ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీనిని తొలి దశలో నెక్సస్ స్మార్ట్‌ఫోన్‌లలోని కొన్ని మోడల్స్ కు మాత్రమే అందించనుంది...

TNN 27 Aug 2016, 4:55 pm
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ తన సరికొత్త ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ 7.0 నోగట్ ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీనిని తొలి దశలో నెక్సస్ స్మార్ట్‌ఫోన్‌లలోని కొన్ని మోడల్స్ కు మాత్రమే అందించనుంది. నెక్సస్6, నెక్సస్ 5ఎక్స్, నెక్సస్ 6పీ, నెక్సస్9, నెక్సస్ ప్లేయర్, పిక్సెల్ సీ అలాగే కొన్ని 4జీ సపోర్ట్ చేసే డివైస్ లలో కూడా 7.0 ఓఎస్ అప్‌డేట్ చేసుకోవచ్చు. అయితే కొత్త ఓఎస్ అప్‌డేట్ అవ్వటానికి సమయం ఎక్కువే తీసుకుంటుందని గూగుల్ వెల్లడించింది. నెక్సస్ సిరీస్ లోని పైన పేర్కొన్న డివైస్ లలో మాత్రమే ఈ ఓఎస్ ను ఇన్స్టాల్ చేసుకోవాల్సిందిగా సూచించింది.
Samayam Telugu heres how to install android 7 0 nougat on your device
నోగట్ 7.0 ఓఎస్ అప్‌డేట్ ఇలా !


నోగట్ 7.0 ఓఎస్ అప్‌డేట్ చేసుకునే విధానం..

- స్మార్ట్‌ఫోన్‌కు అనుసాంధనమైన ఉన్న గూగుల్ అకౌంట్ ప్లేస్టోర్ లో లాగిన్ అవ్వాలి.
-'ఎలిజిబుల్ డివైస్' అప్షన్ సెలెక్ట్ చేసి అందులో మీ డివైస్ ఉందో లేదో చూసుకోవాలి.
- అందులో మీ డివైస్ కనిపిస్తే అది సెలెక్ట్ చేసుకొని 'ఎన్ రోల్ డివైస్' అప్షన్ క్లిక్ చేయాలి.
- దీంతో కొత్త ఓఎస్ అప్‌డేట్ ప్రాసెస్ అవుతుంది.
- మొత్తం ప్రాసెస్ పూర్తయిన తర్వాత 'ఓవర్ ది ఎయిర్ OTA' అని చూపిస్తుంది. దీంతో మీ డివైస్ లో 'నోగట్ 7.0 ఓఎస్' అప్‌డేట్ అయినట్లే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.