యాప్నగరం

ఈడెన్‌లో మ్యాచ్‌కి డివిలియర్స్ వస్తాడట..!

ఆదివారం వరకు టోర్నీలో బెంగళూరు జట్టుకి మ్యాచ్‌లు లేవు. కాబట్టి గాయపడిన క్రికెటర్లు ఫిటెనెస్ సాధించేందుకు ఇదే

TNN 19 Apr 2017, 3:46 pm
ఐపీఎల్ పదో సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును గాయాల బెడద వీడటం లేదు. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లకే గాయం కారణంగా కెప్టెన్ కోహ్లి, డివిలియర్స్ దూరమైనా.. ఇటీవల ఫిటెనెస్ సాధించి ఇద్దరూ మళ్లీ జట్టుతో చేరారు. కానీ రెండు మ్యాచ్‌ల్లోపే డివిలియర్స్ మళ్లీ గాయపడటంతో ప్రస్తుతం బెంగళూరు ఆందోళనలో ఉంది. అతనితో పాటు పేస్ బౌలర్ మిల్స్, స్పిన్నర్ బద్రి కూడా గాయం కారణంగా ప్రస్తుతం జట్టుకు దూరమయ్యారు. అయితే ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరగనున్న మ్యాచ్‌కి ఈ ముగ్గురు క్రికెటర్లు ఫిటెనెస్ సాధించి ఈడెన్ ‌గార్డెన్స్‌లో మ్యాచ్ ఆడతారంటూ బెంగళూరు కోచ్ వెటోరి ధీమా వ్యక్తం చేశాడు. మంగళవారం రాత్రి గుజరాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ క్రికెటర్ల స్థానంలో జట్టులోకి వచ్చిన క్రిస్‌గేల్, ట్రావిస్ హెడ్, ఆడమ్ మిల్నే బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.
Samayam Telugu hopeful that ab de villiers is fit for match against kkr vettori
ఈడెన్‌లో మ్యాచ్‌కి డివిలియర్స్ వస్తాడట..!


‘ఆదివారం వరకు టోర్నీలో బెంగళూరు జట్టుకి మ్యాచ్‌లు లేవు. కాబట్టి గాయపడిన క్రికెటర్లు ఫిటెనెస్ సాధించేందుకు ఇదే మంచి అవకాశం. కోల్‌కతాతో మ్యాచ్‌ కోసం డివిలియర్స్‌తో పాటు బద్రి, మిల్స్ సెలక్షన్‌కి అందుబాటులో ఉంటారని నేను ఆశిస్తున్నా. అయితే మంగళవారం రాత్రి గుజరాత్‌తో ముగిసిన మ్యా‌చ్‌లో క్రిస్‌గేల్, ట్రావిస్ హెడ్ అద్భుతంగా ఆడారు. దీంతో ఆ రోజు తుది జట్టు ఎంపిక క్లిష్టతరం అవుతుందేమో’ అని వెటోరీ వెల్లడించాడు. క్రిస్‌గేల్‌ ఫామ్‌లోకి రావడంతో అతనిపై వేటు పడే అవకాశాలు తక్కువే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.