యాప్నగరం

ఐఐటీ విద్యార్థుల శాటిలైట్ లాంచింగ్‌కు రెడీ

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ముంబై శాఖ విద్యార్థులు తొలిసారిగా ప్రథమ్ అనే శాటిలైట్‌ను తయారు చేశారు.

TNN 22 Sep 2016, 2:47 pm
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ముంబై శాఖ విద్యార్థులు తొలిసారిగా ప్రథమ్ అనే శాటిలైట్‌ను తయారు చేశారు. అది లాంచింగ్‌కు సిద్ధంగా ఉంది. సెప్టెంబర్ 26న సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 18 రోజుల క్రితం షార్ నుంచి ఇన్ శాట్ 3డీఆర్ శాటిలైట్ ను అంతరిక్షంలోకి పంపారు. అతి తక్కువ కాలంలోనే మళ్లీ మరో ఉపగ్రహం పంపేందుకు సిద్ధమయ్యారు. ఇది నిజంగా రికార్డే. సెప్టెంబర్ 26న లాంచ్ చేసే ఉపగ్రహానికి మరో ప్రత్యేకత ఉంది. ఆ రోజు పీఎస్ ఎల్వీ ఒకేసారి రెండు రకాల ఉపగ్రహాలను రెండు వేర్వేరు కక్ష్యల్లోకి ప్రవేశపెడుతుంది. ఇలా ప్రవేశపెట్టడం ఇదే తొలిసారని చెప్పవచ్చు. ప్రథమ్, స్కాట్ శాట్ -1అనే ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ నింగిలోకి తీసుకెళ్లబోతోంది.
Samayam Telugu iit b pratham satellite ready for launch
ఐఐటీ విద్యార్థుల శాటిలైట్ లాంచింగ్‌కు రెడీ



ఇందులో స్కాట్ శాట్ 1 అయిదేళ్ల పాటూ సేవలందిస్తుంది. సముద్రం, వాతావరణ సంబంధిత అధ్యయనాలకు సహకరిస్తుంది. ప్రథమ్ ఐనోస్ఫియర్‌లో ఎలక్ట్రాన్లను లెక్కించడానికి సహకరిస్తుంది. నాలుగు నెలల పాటు ఇది పనిచేస్తుంది. అలాగే బెంగళూరుకు చెందిన ఇంజినీరింగ్ ఇన్ స్టిట్యూట్ వాళ్లు తయారు చేసిన పిశాట్ ఉపగ్రహాన్ని కూడా అదే రోజు లాంచ్ చేయనున్నారు. వీటితో పాటూ అమెరికా, కెనడా, అల్జీరియాకు చెందిన ఉపగ్రహాలు కూడా ఆ రోజున నింగిలోకి దూసుకెళ్లనున్నాయి.

Pratham satellite, designed and developed by IIT mumbai students llite ready for launch. The satellite will be launched by the PSLV XL on september 26th.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.