యాప్నగరం

అబ్దుల్ కలాంకు నాసా అరుదైన గౌరవం

భారత అంతరిక్ష పరిశోధనలపై తనదైన ముద్ర వేసిన అబ్దుల్ కలాంకు అరుదైన గౌరవం దక్కింది. భారతరత్న, మాజీ రాష్ట్రపతి కలాంకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా చక్కటి గుర్తింపునిచ్చింది.

TNN 21 May 2017, 7:14 pm
భారత అంతరిక్ష పరిశోధనలపై తనదైన ముద్ర వేసిన అబ్దుల్ కలాంకు అరుదైన గౌరవం దక్కింది. భారతరత్న, మాజీ రాష్ట్రపతి కలాంకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా అరుదైన గుర్తింపునిచ్చింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో నాసా ఇటీవల ఓ కొత్త బ్యాక్టీరియాను కనుగొంది. ఈ తరహా బ్యాక్టీరియాను ఇప్పటి వరకూ భూమిపై గుర్తించలేదు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఫిల్టర్లలో ల్యాబ్ జెట్ ప్రొపల్షన్ లేబరోటరీ ఈ బ్యాక్టీరియాను గుర్తించింది.
Samayam Telugu in tribute to apj abdul kalam nasa names new species after him
అబ్దుల్ కలాంకు నాసా అరుదైన గౌరవం


కొత్తగా కనుగొన్న ఈ బ్యాక్టీరియాకు.. అబ్దుల్ కలాం పేరిట ‘సోలిబాసిల్లస్ కలామి’ అని నామకరణం చేసింది. 40 నెలలుగా ఐఎస్ఎస్‌లో ఉంచిన ఫిల్టర్‌పై ఈ బ్యాక్టీరియా చేరింది. హెపా ఫిల్టర్‌గా పిలిచే దీన్ని ఐఎస్ఎస్‌లోని హౌస్ కీపింగ్, క్లీన్ వ్యవస్థల్లో ఉపయోగిస్తారు.
‘ఈ బ్యాక్టీరియా పేరు సోలిబాసిల్లస్ కలామి. దీనికి అబ్దుల్ కలాం పేరు పెట్టాం. ప్రజాతి పేరు సోలిబాలిసిల్లస్’ అని జేపీఎల్‌లోని సీనియర్ రీసెర్చ్ సైంటిస్ట్ డాక్టర్ కస్తూరి వెంకటేశ్వరన్ తెలిపారు.

ఐఎస్ఎస్ ఫుట్‌బాల్ గ్రౌండ్ పరిమాణంలో విస్తరించి ఉంది. దీని నిర్మాణాన్ని 1998లో ప్రారంభించారు. 419 టన్నుల బరువుండే ఈ అంతరిక్ష కేంద్రంలో ఆరుగురు శాస్త్రవేత్తలు ఉండే వీలుంది. దీని నిర్మాణం కోసం 150 బిలియన్ డాలర్లను ఖర్చు చేశారు. ఇప్పటి వరకూ 227 మంది ఆస్ట్రోనాట్స్ స్పేష్ స్టేషన్‌కు వెళ్లారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.