యాప్నగరం

స్వాతంత్ర్య దినోత్స‌వ స్పెష‌ల్: అర్ధ‌రాత్రి జెండా ఎగ‌రేసి

దేశం మొత్తం స్వాతంత్ర్య వేడుకలను ఆగస్టు 15న ఉదయం జ‌రుపుకుంటే…బీహార్ లోని పుర్నియా అనే ప్రాంతంలో మాత్రం ముందురోజు అర్థరాత్రే సెలబ్రేట్ చేస్తారు.

Samayam Telugu 15 Aug 2018, 11:10 am
దేశం మొత్తం స్వాతంత్ర్య వేడుకలను ఆగస్టు 15న ఉదయం జ‌రుపుకుంటే…బీహార్ లోని పుర్నియా అనే ప్రాంతంలో మాత్రం ముందురోజు అర్థరాత్రే సెలబ్రేట్ చేస్తారు. పుర్నియాలోని జెండా చౌక్ లో రాత్రి 12.01 నిమిషానికే జాతీయ జెండా ఎగరవేసి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు చుట్టుముట్టున్న స్థానికులంతా భారీ ఎత్తున వస్తారు.
Samayam Telugu పుర్నియాలో అర్ధ‌రాత్రే వేడుక‌లు


ఈ త‌ర‌హా సంప్రదాయాన్ని స్వాతంత్య్ర సమరయోధుడు రామేశ్వర్‌ ప్రసాద్‌ ప్రారంభించారు. ఆయన చనిపోయిన తర్వాత కూడా..ఆయన వారసులు ఈ సంప్రదాయాన్ని అలాగే కొనసాగిస్తున్నారు. భారత్‌కు స్వాతంత్య్రం ప్రకటించిన వెంటనే రామేశ్వర్‌ ప్రసాద్‌ పుర్నియాలో 10 వేల మందితో కలిసి అర్ధరాత్రి జెండా వందన కార్యక్రమం చేపట్టినట్లు ఆయన వారసులు చెప్పారు. అప్పటి నుంచి ఈ వేడుకలను ఇక్కడ అర్ధరాత్రి సమయంలోనే నిర్వహిస్తున్నామని.. ఎప్పుడూ వేడుకల నిర్వహణలో విఫలం కాలేదని వారసులు చెప్పారు. ఆయన మరణానంతరం కుమార్తె సులేఖ.. ఇప్పుడు మనవడు విపుల్‌ ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.