యాప్నగరం

డివిలియర్స్ బాధపడుతూనే వెళ్లిపోయాడు..!

టోర్నీలో తప్పిదాల నుంచి కొన్ని పాఠాలు నేర్చుకున్నాం. వచ్చే ఏడాది పున‌రావృతం కానివ్వం. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు

TNN 9 May 2017, 5:26 pm
ఐపీఎల్ పదో సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రదర్శన అభిమానులకే కాదు.. ఆ జట్టు క్రికెటర్లని తీవ్రంగా బాధపెట్టింది. ఒంటిచేత్తో మ్యాచ్‌ని మార్చే సత్తా ఉన్న విరాట్ కోహ్లి, క్రిస్‌గేల్, ఏబీ డివిలియర్స్ లాంటి మేటి క్రికెటర్లు ఉన్నా ఆ జట్టు టోర్నీలో ఇప్పటి వరకు సాధించినవి రెండే విజయాలు. టోర్నీ ఆరంభంలోనే కెప్టెన్ కోహ్లి, ఏబీ డివిలియర్స్ కొన్ని మ్యాచ్‌లకి దూరమవడం ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని దారుణంగా దెబ్బతీసింది. కోట్ల రూపాయలు పోసి కొనుకున్న బౌలర్ మిల్స్ చేతులెత్తేయగా.. ఆల్‌రౌండర్ వాట్సన్ ఒక్క మ్యాచ్‌లో కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. గాయం నుంచి కోలుకుని వచ్చిన కోహ్లి, డివిలియర్స్ ఫామ్‌ని అందుకోలేకపోయారు. దీంతో టోర్నీ సాంతం తమకంటే బలహీనమైన జట్ల చేతుల్లో కూడా బెంగళూరు వరుసగా ఓడిపోతూ.. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పడిపోయింది.
Samayam Telugu ipl 2017 ab de villiers leaves rcb to return home to family
డివిలియర్స్ బాధపడుతూనే వెళ్లిపోయాడు..!


‘ఐపీఎల్ పదో సీజన్‌ బాగా నిరాశపరిచింది. టోర్నీలో తప్పిదాల నుంచి కొన్ని పాఠాలు నేర్చుకున్నాం. వచ్చే ఏడాది పున‌రావృతం కానివ్వం. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఫ్యామిలీతో గడిపేందుకు ఇంటికి వెళ్లాను’ అని డివిలియర్స్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. టోర్నీలో 9 మ్యాచ్‌లాడిన ఏబీ ఒక అర్ధశతకం సాధించి చేసింది 216 పరుగులతో ఘోరంగా విఫలమయ్యాడు. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో ఆదివారం తన చివరి మ్యాచ్‌లో బెంగళూరు తలపడనుంది. ఈ మ్యాచ్‌లో డివిలియర్స్ స్థానంలో జట్టులోకి ఎవరు వస్తారో చూడాలి. ఛాంపియన్స్ ట్రోఫీ జూన్ 1 నుంచి ఆరంభంకానుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.