యాప్నగరం

ధోనీ హిట్టింగ్‌తోనే.. ముంబయి ఓడిపోలేదు

టీ20ల్లో ధోనీ లాంటి ఫినిషర్ క్రీజులో ఉంటే పరుగుల వరద ఊహించిందే. మా బౌలర్లు

TNN 17 May 2017, 4:41 pm
ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా వాంఖడేలో జరిగిన క్వాలిఫయర్ -1 మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌పై 20 పరుగుల తేడాతో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ గెలిచిన విషయం తెలిసిందే. పుణె హిట్టర్ మహేంద్రసింగ్ ధోని (40 నాటౌట్: 26 బంతుల్లో 5x6) ధాటికి ముంబయి బౌలర్లు చివరి రెండు ఓవర్లలోనే 41 పరుగులు సమర్పించుకున్నారు. ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన మెక్లనగాన్ బౌలింగ్‌లో రెండు సిక్స్‌లు బాదిన ధోని.. చివరి ఓవర్‌ వేసిన బుమ్రా బౌలింగ్‌లో కూడా రెండు భారీ సిక్సర్లు కొట్టేశాడు.
Samayam Telugu ipl 2017 dont think last two overs cost us says parthiv patel
ధోనీ హిట్టింగ్‌తోనే.. ముంబయి ఓడిపోలేదు


ధోని హిట్టింగ్ కారణంగానే ముంబయి ఓడిపోయిందా..? అని పార్థీవ్ పటేల్‌ని ప్రశ్నించగా.. ‘టీ20ల్లో ధోనీ లాంటి ఫినిషర్ క్రీజులో ఉంటే పరుగుల వరద ఊహించిందే. మా బౌలర్లు చివరి వరకూ బాగానే బౌలింగ్ చేశారు. కానీ.. ఆ రెండు ఓవర్ల కారణంగానే ముంబయి ఓడిపోయిందనే వాదన కరెక్ట్ కాదు. జస్‌ప్రీత్ బుమ్రా ఐపీఎల్‌లో ధోనీపై ఆధిపత్యం చెలాయించడం గత ఏడాది నుంచి చూస్తున్నాం. కానీ.. ఈ మ్యాచ్‌లో ధోనీ పైచేయి సాధించాడు. ఆరు ఓవర్ల తర్వాత వరుసగా వికెట్లు చేజార్చుకోవడం ముంబయిని బాగా దెబ్బతీసింది. స్లో బంతులు విసురుతూ వాషింగ్టన్ సుందర్ కీలకమైన మూడు వికెట్లు తీసి మ్యాచ్‌ని మాకు దూరం చేశాడు’ అని కీపర్ పార్థీవ్ వివరించాడు. శుక్రవారం బెంగళూరు వేదికగా జరగనున్న రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో ముంబయి తలపడనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.