యాప్నగరం

కోహ్లి ఆ షాట్స్ ఎందుకు ఆడుతున్నావు..?

కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఈడెన్ ‌గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో అతను ఆడినవి ఏమంత గ్రేట్ షాట్స్ కావు. జట్టు ఎలా ఆడుతున్నా..

TNN 7 May 2017, 5:52 pm
ఐపీఎల్ పదో సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి షాట్ల ఎంపికలో తడబడుతున్నాడని భారత మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డారు. గ్లామరస్ షాట్ల కోసం కోహ్లి వెంపర్లాడుతూ క్రికెటింగ్ షాట్లను నిర్లక్ష్యం చేయడంతోనే అతను తక్కువ స్కోర్లకు పెవిలియన్ చేరుతున్నాడని గవాస్కర్ వివరించారు. తాజా సీజన్‌లో ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లాడిన కోహ్లి మూడు అర్ధశతకాల సాయంతో చేసిన పరుగులు 250 మాత్రమే. గత ఏడాది 16 మ్యాచ్‌లాడిన కోహ్లి 4 శతకాలతో పాటు.. 7 అర్ధశతకాలు సాధించి 973 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచి ఒంటిచేత్తో బెంగళూరు జట్టుని ఫైనల్‌కి చేర్చాడు. కానీ.. ఈ ఏడాది కోహ్లి వరుసగా విఫలమవుతుండటంతో ఇప్పటికే ప్లేఆఫ్ ఆశలు వదులుకున్న బెంగళూరు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పడిపోయింది.
Samayam Telugu ipl 2017 gavaskar wants virat kohli to get a reality check
కోహ్లి ఆ షాట్స్ ఎందుకు ఆడుతున్నావు..?


‘విరాట్ కోహ్లి మొదట తనని తాను అద్దంలో చూసుకుని ఆత్మవిమర్శ చేసుకోవాలి. కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఈడెన్ ‌గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో అతను ఆడినవి ఏమంత గ్రేట్ షాట్స్ కావు. జట్టు ఎలా ఆడుతున్నా.. కెప్టెన్‌గా ఎక్కువ సేపు క్రీజులో ఉండాల్సిన బాధ్యత విరాట్ కోహ్లిపై ఉంది. అతను ఫామ్‌లో లేకపోయినా.. క్రికెటింగ్ షాట్లకే కట్టుబడి తొలుత ఇన్నింగ్స్‌ని చక్కదిద్దాలి. ఆ తర్వాతే అవకాశం చిక్కితే బ్యాట్ ఝళిపించాలి. ఇక్కడ సిక్స్ , ఫోర్‌కి మధ్య వ్యత్యాసం రెండు పరుగులే. కానీ.. సిక్స్ కొట్టే సమయంలో 100 శాతం రిస్క్ ఉంటుంది. ఫోర్ విషయంలో అలా కాదు.. ఈ తేడాను కోహ్లి గుర్తిస్తే చాలు’ అని గవాస్కర్ వివరించారు. కోల్‌కతాతో మ్యాచ్‌లో ఆఫ్ స్టంప్‌కి దూరంగా వెళ్తున్న బంతిని వెంటాడి కోహ్లి ఔటవగా.. పంజాబ్‌తో మ్యాచ్‌లో క్రీజు వెలుపలికి వచ్చి భారీ షాట్ కోసం ప్రయత్నించి క్లీన్ బౌల్డయ్యాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.