యాప్నగరం

టై హ్యాట్రిక్ సాధించగానే తనను తానే తిట్టుకున్న రైనా

హ్యాట్రిక్ సహా ఐదు వికెట్లు తీసిన ఆండ్రూ టై ప్రదర్శన చూశాక.. రైనా తనను తానే తిట్టుకుని ఉంటాడు. ఎందుకో తెలుసా?

TNN 14 Apr 2017, 10:28 pm
ఐపీఎల్‌లో అరంగేట్రంతోనే సంచలన బౌలింగ్ ప్రదర్శన చేసిన ఆండ్రూ టైని చూశాక ఆ జట్టు కెప్టెన్ సురేశ్ రైనా ఎంత ఆనందించాడో.. అంత కంటే ఎక్కువగా తనను తాను తిట్టుకొని ఉంటాడు. ఒక్క రైనానే కాదు.. ఆ జట్టు కోచ్, మేనేజ్‌మెంట్ అంతా ఇలాగే చేసి ఉంటారు. ఎందుకంటే.. తాను ఆడిన తొలి మ్యాచ్‌లోనే టై హ్యాట్రిక్ సహా.. ఐదు వికెట్లు పడగొట్టాడు. కాగా గత రెండు మ్యాచ్‌ల్లో గుజరాత్ బౌలర్లు తీసింది కేవలం ఒకే ఒక్క వికెట్.
Samayam Telugu ipl 2017 gl vs rps andrew tye hattrick makes suresh raina felt sad
టై హ్యాట్రిక్ సాధించగానే తనను తానే తిట్టుకున్న రైనా


లయన్స్ ఆడిన తొలి మ్యాచ్‌లో కోల్‌కతా పది వికెట్ల తేడాతో గెలుపొందింది. చెలరేగిన గౌతీ-లిన్ జోడి 165 పరుగుల లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ చేధించింది. టీ20ల్లో వికెట్ నష్టపోకుండా అత్యధిక పరుగుల లక్ష్యాన్ని సాధించిన జట్టుగా కోల్‌కతా రికార్డు నెలకొల్పింది. తర్వాతి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు శిఖర్ ధవన్ వికెట్ మాత్రమే కోల్పోయి 140/1తో విజయం సాధించింది.

రైనా సహా గుజరాత్ మేనేజ్‌మెంట్ తమను తాము తిట్టుకోవడానికి మరో కారణం ఉంది. అదేంటంటే.. టీ20ల్లో ఆండ్రూ టై హ్యాట్రిక్ సాధించడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది బీబీఎల్‌లోనూ వరుసగా మూడు వికెట్లు తానెంటో నిరూపించుకున్నాడు. ఈ విషయం తెలిసినప్పటికీ టైకి జట్టులో చోటు కల్పించలేదు. ఫలితంగా భారీ మూల్యాన్నే చెల్లించుకున్నారు. పుణేతో మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లో హ్యాట్రిక్ సాధించిన టై.. మరో వికెట్ కూడా సాధించే వాడే.. చాహర్ క్యాచ్‌ను జడేజా నేలపాలు చేయడంతో ఐదు వికెట్లతో సరిపెట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన టై 17 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు సాధించాడు. అరంగేట్రంలోనే ఐపీఎల్‌లో ఐదు వికెట్లు తీసిన బౌలర్ బహుశా టై మాత్రమే కావొచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.