యాప్నగరం

హైదరాబాద్ అందుకే రషీద్‌ని తీసుకుందట..!

పొదపుగా బౌలింగ్ చేయడమే కాదు.. భాగస్వామ్యాలను విడదీయడంలో రషీద్‌కి మంచి రికార్డు

TNN 17 May 2017, 8:51 pm
ఐపీఎల్ పదో సీజన్‌లో స్పిన్ బలం పెంచుకునేందుకే అఫ్గానిస్థాన్ స్పిన్నర్లని జట్టులోకి తీసుకున్నట్లు సన్‌రైజర్స్ హైదరాబాద్ మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ వెల్లడించారు. గత ఏడాది హైదరాబాద్ టైటిల్ గెలిచినా.. స్పిన్ విభాగంలో బలహీనంగా కనిపించిందని దీంతో ఐపీఎల్ వేలంలో రషీద్ ఖాన్, మహ్మద్ నబీని కొనుగోలు చేసినట్లు ఆయన వివరించారు. తాజా సీజన్‌లో 13 మ్యాచ్‌లాడిన రషీద్ ఖాన్ పొదుపుగా బౌలింగ్ చేస్తూ.. 17 వికెట్లతో మెరుగైన ప్రదర్శన చేశాడు.
Samayam Telugu ipl 2017 sunrisers hyderabad srh wanted to strengthen spin attack says vvs laxman
హైదరాబాద్ అందుకే రషీద్‌ని తీసుకుందట..!


‘ఐపీఎల్ పదో సీజన్‌లో స్పిన్ విభాగాన్ని బలోపేతం చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. రషీద్ ఖాన్ ప్రతిభావంతమైన స్పిన్నర్. అఫ్గానిస్థాన్ తరఫున అతను అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. పొదపుగా బౌలింగ్ చేయడమే కాదు.. భాగస్వామ్యాలను విడదీయడంలో రషీద్‌కి మంచి రికార్డు ఉంది. అందుకే వేలంలో భారీ మొత్తానికి అతనికి కొనుగోలు చేశాం. స్పిన్ బౌలింగ్ చేసే ఆల్‌రౌండర్ కోటాలో మహ్మద్ నబీని వేలంలో ఎంచుకున్నాం’ అని లక్ష్మణ్ వివరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.